మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- August 21, 2026
మనామా: బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్, పొగాకు ఉత్పత్తుల విక్రయాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకురానుంది. 18 ఏళ్లలోపు వారికి పొగాకు, వేప్, ఎలక్ట్రానిక్ షిషా ఉత్పత్తులను విక్రయించే దుకాణాలకు గరిష్ఠంగా BD1,000 జరిమానా విధించేలా బిల్లును సిద్ధం చేస్తున్నారు. నిబంధనలను పదేపదే ఉల్లంఘించే దుకాణాలను శాశ్వతంగా మూసివేసే అవకాశం కూడా ఉంది.
పార్లమెంట్ పబ్లిక్ యుటిలిటీస్ అండ్ ఎన్విరాన్‌మెంట్ కమిటీ చైర్మన్ ఎంపీ మహమ్మద్ మౌసా మాట్లాడుతూ.. ఈ బిల్లును తదుపరి పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా తక్కువ ధరలకు వేప్ పాడ్‌లను రీఫిల్ చేసి విక్రయించడం వల్ల యువతకు వేపింగ్ సులభంగా అందుబాటులోకి వస్తోందని తెలిపారు.
బహ్రెయిన్‌లో ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు వారికి పొగాకు ఉత్పత్తులను విక్రయించడం లేదా అందించడం నిషేధం. 2025లో చేసిన సవరణల ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన వారికి కనీసం BD100 జరిమానా విధించవచ్చు. కోర్టు తీర్పు అనంతరం దుకాణాన్ని మూడు నెలల వరకు మూసివేయడం లేదా ఉల్లంఘనకు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. కొత్త బిల్లు అమల్లోకి వస్తే జరిమానాను ఏకంగా BD1,000కు పెంచనున్నారు. అదే తప్పును పదేపదే చేసే దుకాణాలపై శాశ్వత మూసివేత చర్యలు తీసుకోనున్నారు.
18 ఏళ్లలోపు వారికి పొగాకు, వేప్ ఉత్పత్తులు విక్రయిస్తున్నట్లు అనుమానిస్తున్న అనేక దుకాణాలను ఇప్పటికే గుర్తించి సంబంధిత అధికారులకు అప్పగించినట్లు మౌసా తెలిపారు. ప్రస్తుత చట్టాల ప్రకారం ఆయా దుకాణాలపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పిల్లలకు ఈ ఉత్పత్తులు సులభంగా అందుబాటులోకి రావడం ఆందోళనకరంగా మారిందని, దీనిని అరికట్టేందుకు తల్లిదండ్రులు, పాఠశాలలు, విద్యాశాఖ, ప్రభుత్వ సంస్థలు, సామాజిక సంఘాలు సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
కొత్త బిల్లులో వేప్, ఎలక్ట్రానిక్ షిషా దుకాణాలపై అదనపు తనిఖీలకు కూడా ప్రతిపాదనలు ఉన్నాయి. రిటైలర్లు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు విక్రయాల రికార్డులను నిర్వహించాలి. అనుమానాస్పదంగా మైనర్లకు విక్రయాలు జరిగినట్లు తేలితే తనిఖీల కోసం సీసీటీవీ ఫుటేజీ, విక్రయాల రికార్డులను అధికారులు పరిశీలించే అవకాశం ఉంటుంది. పిల్లలకు పొగాకు, వేప్ ఉత్పత్తుల వల్ల కలిగే హానిని దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వం కలిసి పూర్తి స్థాయి బిల్లును రూపొందిస్తున్నట్లు మౌసా తెలిపారు.
తాజా వార్తలు
- పిల్లల సోషల్ మీడియాపై ఆంక్షలు.. యూఏఈ స్కూళ్లో మారనున్న పరిస్థితులు..!!
- సౌదీలో స్కూల్ రవాణా సేవలపై విద్యాశాఖ కీలక మార్గదర్శకాలు..!!
- కటారా ఆహ్వానం.. వీకెండ్ లో కల్చర్, వినోదంతో సందడి..!!
- మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- గాయపడ్డ పౌరుడికి ఎయిర్ అంబులెన్స్ సేవలు..!!
- కువైట్‌లో సమగ్ర డ్రైనేజీ వ్యవస్థ.. ఫ్లడ్ సమస్యలకు చెక్..!!
- దుబాయ్ టయోటా బిల్డింగ్‌లో అక్రమ పార్టిషన్లు..జరిమానాలు చెల్లించిన తర్వాతే ఖాళీ చేయాలి
- సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు
- డాలస్‌లో ఘనంగా కవికులాలంకార వేటూరి సాహితీ మహోత్సవం
- యూఏఈలో ఉద్యోగికి పని ప్రదేశంలో గాయమైతే పరిహారం ఎలా? పూర్తి వివరాలు







