బాంబు పేలుడు.. తీవ్ర ఖండించిన సౌదీ అరేబియా..!!

- August 22, 2026 , by Maagulf
బాంబు పేలుడు.. తీవ్ర ఖండించిన సౌదీ అరేబియా..!!

రియాద్:  అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లోని ఓ విద్యా కేంద్రం సమీపంలో జరిగిన బాంబు పేలుడును సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు తెలిపింది.

ఈ దాడిపై సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అన్ని రకాల హింస, తీవ్రవాదం, ఉగ్రవాద చర్యలను సౌదీ అరేబియా పూర్తిగా తిరస్కరిస్తుందని పునరుద్ఘాటించింది.

బాంబు దాడి అనంతరం అఫ్గానిస్థాన్ ప్రభుత్వం, ప్రజలకు సౌదీ అరేబియా తన సంఘీభావాన్ని ప్రకటించింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com