4 నెలల్లో 22 వేల మంది పాకిస్థానీల బహిష్కరణ..!!
- August 22, 2026
యూఏఈ: వీసా నిబంధనల ఉల్లంఘన, గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలో ఉండటం, బెగ్గింగ్, ఫేక్ డాక్యుమెంట్స్ తదితర కారణాలతో కేవలం నాలుగు నెలల్లో దాదాపు 22 వేల మంది పాకిస్థానీయులను గల్ఫ్ దేశాలు బహిష్కరించారు.
ఆ దేశ జాతీయ పార్లమెంట్‌లో ఈ అంశంపై ప్రశ్న లేవనెత్తిన నేపథ్యంలో సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది మార్చి 1 నుంచి జూలై 13 వరకు మొత్తం 21,951 మంది పాకిస్థానీయులు గల్ఫ్ దేశాల నుంచి డిపోర్ట్ అయినట్లు పేర్కొన్నారు.
దేశం విడిచి పారిపోయిన (Absconders) వారిలో 4,628 మందిని బహిష్కరించగా, 1,294 మందిని జైలుకు పంపారు. మరో 968 మందిని బ్లాక్‌లిస్ట్ చేశారు. పాస్‌పోర్టులు పోగొట్టుకున్న కేసుల్లో 1,155 మంది డిపోర్టేషన్‌కు గురయ్యారు. వీసా నిబంధనలు ఉల్లంఘించినందుకు 689 మంది బహిష్కరణకు గురికాగా, గల్ఫ్ దేశాల్లోకి ప్రవేశం నిరాకరించడంతో మరో 342 మంది వెనక్కి పంపబడ్డారు.
ఇక ఇంటర్‌పోల్ సహకారంతో యూఏఈ నుంచి 9 మంది పాకిస్థానీయులను బహిష్కరించినట్లు వివరించారు. దేశాల వారీగా చూస్తే.. సౌదీ అరేబియా 3,921 మంది అబ్స్కాండర్లను బహిష్కరించగా, యూఏఈ 636 మందిని డిపోర్ట్ చేసింది. వీసా సంబంధిత నిబంధనల ఉల్లంఘనలపై సౌదీ అరేబియా 1,924 మంది పాకిస్థానీయులను బహిష్కరించింది. యూఏఈలో 347 మంది, ఒమన్‌లో 295 మంది ఇదే కారణంతో డిపోర్ట్ అయినట్లు పార్లమెంట్‌కు సమర్పించిన సమాధానంలో వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







