సౌదీలో వారం రోజుల్లో 13,724 మందిపై బహిష్కరణ వేటు..!!
- August 23, 2026
రియాద్: సౌదీ అరేబియాలో అక్రమంగా నివసిస్తున్న వారిపై అధికారులు చేపట్టిన తనిఖీల్లో వారం రోజుల్లో 14,260 మంది ఉల్లంఘనదారులను అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఆగస్టు 13 నుంచి 19 వరకు భద్రతా బలగాలు, సంబంధిత ప్రభుత్వ సంస్థలతో కలిసి నిర్వహించిన సంయుక్త తనిఖీల్లో ఈ అరెస్టులు జరిగాయి. అరెస్టయిన వారిలో 6,900 మంది నివాస చట్టాన్ని , 3,982 మంది సరిహద్దు భద్రతా చట్టాన్ని, 3,378 మంది కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినవారు ఉన్నారు. ఇక 13,724 మంది అక్రమ నివాసితులను దేశం నుంచి బహిష్కరించారు. మరో 18,808 మందిని ప్రయాణ పత్రాల కోసం వారి దౌత్య కార్యాలయాలకు, 5,386 మందిని ప్రయాణ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు సంబంధిత విభాగాలకు అప్పగించినట్లు తెలిపారు.
సరిహద్దు వద్ద 1,524 మంది అరెస్టు
సౌదీలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన 1,524 మందిని అధికారులు అరెస్టు చేశారు. వీరిలో 36 శాతం యెమెన్ జాతీయులు, 63 శాతం ఇథియోపియా జాతీయులు కాగా, మిగిలిన ఒక శాతం ఇతర దేశాలకు చెందినవారు. అలాగే సౌదీ నుంచి అక్రమంగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన 38 మందిని కూడా అరెస్టు చేశారు. అక్రమ నివాసితులకు రవాణా, ఆశ్రయం లేదా ఉద్యోగాలు కల్పించిన ఆరోపణలపై 24 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మొత్తం 31,922 మంది విదేశీయులపై చట్టపరమైన చర్యలు అమలు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. వీరిలో 29,961 మంది పురుషులు, 1,961 మంది మహిళలు ఉన్నారు.
సహకరిస్తే కఠిన శిక్షలు
అక్రమంగా వ్యక్తులను సౌదీలోకి ప్రవేశించేందుకు సహాయం చేయడం, దేశంలో రవాణా చేయడం, ఆశ్రయం కల్పించడం లేదా ఇతర సహాయాలు అందించడం వంటి చర్యలకు 15 ఏళ్ల వరకు జైలు శిక్ష, గరిష్ఠంగా 10 లక్షల సౌదీ రియాల్స్ జరిమానా విధించవచ్చని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ హెచ్చరించింది. అక్రమ రవాణాకు ఉపయోగించిన వాహనాలు, ఆశ్రయం కల్పించిన ఇళ్లను కూడా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు మక్కా, రియాద్, తూర్పు ప్రావిన్స్‌లలో 911కు, ఇతర ప్రాంతాల్లో 999 లేదా 996కు ఫోన్ చేసి తెలియజేయాలని మంత్రిత్వశాఖ సూచించింది.
తాజా వార్తలు
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..







