ఫస్ట్, బిజినెస్ క్లాస్ టికెట్లపై రూమర్స్.. ఖండించిన కువైట్ ఎయిర్‌వేస్..!!
- August 24, 2026
కువైట్ : ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్‌లో బుక్ చేసుకున్న ప్రయాణికుల టికెట్లను ఎకానమీ క్లాస్‌కు మారుస్తున్నారన్న వార్తలను కువైట్ ఎయిర్‌వేస్ ఖండించింది. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. ఏదైనా ఆపరేషనల్ కారణాల వల్ల ప్రయాణికుడి బుకింగ్‌లో మార్పు చేయాల్సి వస్తే, నిర్ణీత విధానాల ప్రకారం పరిస్థితిని పరిష్కరిస్తామని ఎయిర్‌లైన్ తెలిపింది. అలాంటి సందర్భాల్లో ప్రయాణికులను నేరుగా సంప్రదించి పూర్తి సమాచారం అందిస్తామని పేర్కొంది. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలు, నిబంధనల ప్రకారం ప్రయాణికులకు లభించాల్సిన పరిహారం సహా అన్ని హక్కులను కాపాడుతామని వెల్లడించింది.
ప్రయాణికులు బుక్ చేసుకున్న క్లాస్, ధృవీకరించిన బుకింగ్‌లకు కట్టుబడి ఉండటమే తమ సంస్థ విధానమని కువైట్ ఎయిర్‌వేస్ తెలిపింది. ప్రయాణికులకు అర్హమైన సేవలను అందించడంతో పాటు, అదనపు ఆర్థిక భారం లేదా ఇతర ఇబ్బందులు కలగకుండా చూస్తామని స్పష్టం చేసింది. తమ బుకింగ్‌లు, విమానాల వివరాలపై సమాచారం కోసం ప్రయాణికులు కువైట్ ఎయిర్‌వేస్ అధికారిక కమ్యూనికేషన్ ఛానళ్లను మాత్రమే ఉపయోగించాలని కువైట్ ఎయిర్‌వేస్ సూచించింది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







