సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- August 24, 2026
పారిస్: సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ఫ్రాన్స్ పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాల్లో ముఖ్యమైన ముందడుగు అని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అన్నారు. ప్రాంతీయ సవాళ్ల నేపథ్యంలో శాంతి, స్థిరత్వాన్ని ప్రోత్సహించేందుకు ఫ్రాన్స్, సౌదీ అరేబియా కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’లో మాక్రాన్ స్పందించారు.
ప్రాంతీయ సవాళ్లను ఎదుర్కొనే విషయంలో రెండు దేశాలు ఎప్పటినుంచో శాంతి, స్థిరత్వానికి మద్దతుగా కలిసి పనిచేస్తున్నాయని, ఇకపై కూడా ఇదే తీరులో సంప్రదింపులు కొనసాగిస్తాయని పేర్కొన్నారు. రియాద్-పారిస్ భాగస్వామ్యం కీలక ప్రాజెక్టులు, అధునాతన సాంకేతికత, పెట్టుబడులు, అంతర్జాతీయ ఈవెంట్లలోనూ కొనసాగుతుందని మాక్రాన్ స్పష్టం చేశారు.
మాక్రాన్ ఆహ్వానం మేరకు క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్నారు. రాజకీయ, ఆర్థిక, వ్యూహాత్మక రంగాల్లో ఇరు దేశాల సహకారాన్ని మరింత బలోపేతం చేయడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యమని అధికార వర్గాలు తెలిపాయి.
క్రౌన్ ప్రిన్స్ పర్యటన సందర్భంగా ఆరోగ్యం, రవాణా, ఇంధనం తదితర రంగాలకు సంబంధించిన పలు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఇంధనం, విమానయానం, రక్షణ రంగాలతో పాటు సౌదీ-ఫ్రెంచ్ భాగస్వామ్యానికి కీలకమైన ఆర్థిక, వ్యూహాత్మక అంశాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు.
మిడిలీస్టులో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో జరుగుతున్న ఈ సమావేశాల్లో ప్రాంతీయ పరిణామాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు ఫ్రెంచ్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. అదే సమయంలో హార్ముజ్ తాజా పరిస్థితి, ఇంధన సరఫరా, మిడిలీస్టును యూరప్‌తో అనుసంధానించే రవాణా మార్గాల విస్తరణపై చర్చలు జరిగే అవకాశం ఉంది. అలాగే లెబనాన్, సిరియా, పాలస్తీనా అంశాలు కూడా చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందన్నారు.
క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ గతంలో 2022 జూలై, 2023 జూన్‌లలో ఫ్రాన్స్ లో పర్యటించారు. కాగా, మాక్రాన్ 2024 డిసెంబర్‌లో సౌదీ అరేబియాలో పర్యటించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత







