నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- August 24, 2026
కువైట్: వాణిజ్య నిబంధనలను ఉల్లంఘించినందుకు సల్మియాలోని రెండు ఆరోగ్య సంస్థలను మూసివేసినట్టు కువైట్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. అహ్మదీ, ముబారక్ అల్-కబీర్ గవర్నరేట్లకు చెందిన మంత్రిత్వ శాఖ అత్యవసర తనిఖీ బృందం.. ముబారక్ అల్-కబీర్ గవర్నరేట్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగంతో కలిసి తనిఖీలు నిర్వహించిందని వెల్లడించింది.
ఈ తనిఖీల్లో కొన్ని వాణిజ్య కార్యకలాపాల్లో నగదు లావాదేవీలను నిషేధిస్తూ జారీ చేసిన 2026 నాటి మంత్రి నిర్ణయం నంబర్ 32ను ఉల్లంఘించినట్లు గుర్తించారు. దీంతోపాటు సంస్థల నిర్వహణకు సంబంధించిన మరికొన్ని నిబంధనల ఉల్లంఘనలు కూడా బయటపడ్డాయని తెలిపింది. నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణ కావడంతో రెండు సంస్థలను వెంటనే మూసివేసి, సంబంధిత చట్టపరమైన చర్యలను ప్రారంభించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!







