ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- August 24, 2026
మస్కట్: విదేశీయులతో వివాహాలు చేసుకుంటున్న ఒమానీల సంఖ్య పెరుగుతున్నట్లు సుప్రీం జ్యుడీషియరీ కౌన్సిల్ గణాంకాలు వెల్లడించాయి. గత మూడేళ్లలో మొత్తం 7,719 మంది ఒమానీలు విదేశీయులను వివాహం చేసుకున్నారు. వీరిలో 640 మంది ఒమానీ మహిళలు విదేశీ పురుషులను పెళ్లి చేసుకున్నారు. 2023 అక్టోబర్ 29 నుంచి 2026 జూన్ 30 వరకు ఒమానీలు-విదేశీయుల మధ్య జరిగిన వివాహాల్లో సుమారు 1,226 విడాకుల కేసులు నమోదయ్యాయి. అంటే ప్రతి ఆరు వివాహాలకు సగటున ఒక విడాకుల కేసు నమోదైనట్లు గణాంకాలు వెల్లడించాయి.
సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖలోని ఫ్యామిలీ కౌన్సెలింగ్ అధిపత సయీద్ బిన్ రషీద్ అల్ మక్తూమీ మాట్లాడుతూ.. విడాకుల రేట్లను ముఖ్యమైన సామాజిక సూచికలుగా మంత్రిత్వ శాఖ పరిగణిస్తోందన్నారు. విడాకుల గణాంకాలను నమోదు చేయడం మాత్రమే కాకుండా, ప్రతి కేసుకు సంబంధించిన కారణాలు, పరిస్థితులను కూడా విశ్లేషించడం అవసరమని చెప్పారు.
ఫ్యామిలీ గైడెన్స్, కౌన్సెలింగ్ విభాగం దంపతుల మధ్య అనుకూలత, కుటుంబ ఐక్యతను పెంపొందించడంతో పాటు వైవాహిక సమస్యల పరిష్కార నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. ‘లైఫ్ కంపానియన్’ కార్యక్రమం ద్వారా ఏడాది పొడవునా వివిధ గవర్నరేట్లలో వైవాహిక కౌన్సెలింగ్ సేవలు అందిస్తున్నారని, ఇది వివాహం చేసుకోవాలని భావిస్తున్నవారితో పాటు కొత్తగా వివాహమైన దంపతులకు కూడా ఉపయోగపడుతుందన్నారు. వైవాహిక సమస్యలు విడాకుల స్థాయికి చేరకముందే పరిష్కరించేందుకు ముందస్తు కౌన్సెలింగ్ సేవలను కూడా అందిస్తున్నట్లు అల్ మక్తూమీ తెలిపారు.
వేరే దేశానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్న సందర్భాల్లో సాంస్కృతిక, సామాజిక భేదాలను గౌరవించడం, వాటికి అనుగుణంగా మారడం, దంపతుల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడం వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు. వ్యక్తిగత సమస్యలపై మాట్లాడాల్సిన వారికి ప్రత్యేక కౌన్సెలింగ్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎలక్ట్రానిక్ సేవల పోర్టల్, యూనిఫైడ్ కాల్ సెంటర్ (1555) ద్వారా లేదా ఆయా గవర్నరేట్లలోని సామాజిక అభివృద్ధి విభాగాలను సందర్శించడం ద్వారా ఫ్యామిలీ కౌన్సెలింగ్ సేవలను పొందవచ్చని మంత్రిత్వశాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!







