ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- August 25, 2026
దోహా: 2026–27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు, బదిలీల కోసం ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ను ఖతర్ విద్య, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) ప్రారంభించింది. అన్ని జాతీయతలకు చెందిన విద్యార్థులు ఈ సేవను వినియోగించుకోవచ్చని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆగస్టు 25 నుంచి అక్టోబర్ 1 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఇంటి నుంచే ఆన్లైన్లో ప్రవేశం లేదా పాఠశాల బదిలీ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఇందుకోసం మంత్రిత్వ శాఖకు చెందిన మారిఫ్ పబ్లిక్ సర్వీసెస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 2026–27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలను సిద్ధం చేసే చర్యల్లో భాగంగా మంత్రిత్వ శాఖ ఆరు కొత్త ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించడంతో పాటు, పాఠశాల ప్రధానోపాధ్యాయుల నియామకాలు, బదిలీలను కూడా చేపట్టింది.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







