రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- August 25, 2026
అబుదాబి: యూఏఈలో నిర్వహిస్తున్న బిగ్ టికెట్ రెండో ఆగస్టు వారపు ఈ-డ్రాలో భారత్‌కు చెందిన నలుగురు విజేతలు ఒక్కొక్కరు Dh25,000 చొప్పున గెలుచుకున్నారు. ఈ నలుగురిలో తొలిసారి విజయం సాధించిన వారు ఉండగా, ఏళ్లుగా బిగ్ టికెట్‌లో పాల్గొంటున్నవారూ ఉన్నారు.
భారతీయ ప్రవాసి ముహమ్మద్ జహీర్ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన బిగ్ టికెట్ నంబర్ 290-094275 డ్రాలో ఎంపికైంది. దీంతో Dh25,000 నగదు బహుమతి గెలుచుకున్నారు. తన టికెట్ విజేతగా ఎంపికైన విషయం తెలిసి జహీర్ ఆనందం వ్యక్తం చేశారు.
56 ఏళ్ల వ్యాపారవేత్త సాజిద్ ఖాన్ దాదాపు మూడు దశాబ్దాలుగా యూఏఈలో నివసిస్తున్నారు. పుణేకు చెందిన ఆయన కొన్నేళ్లుగా బిగ్ టికెట్‌లో పాల్గొంటున్నారు. ఈసారి ఆయన టికెట్ Dh25,000 బహుమతిని అందించింది. గెలుచుకున్న నగదుతో తన పిల్లలను విహారయాత్రకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.
64 ఏళ్ల సివిల్ ఇంజినీర్ థామస్ గీవర్గీస్ కేరళకు చెందినవారు. గత 20 ఏళ్లుగా యూఏఈలో నివసిస్తున్నారు. ప్రతి నెలా డ్రాల్లో పాల్గొంటున్న ఆయన కొన్నిసార్లు వ్యక్తిగతంగా, మరికొన్నిసార్లు నలుగురు సభ్యులతో కలిసి గ్రూప్‌గా టికెట్లు కొనుగోలు చేసేవారు. ఈసారి గ్రూప్‌గా కొనుగోలు చేసిన టికెట్‌కు Dh25,000 బహుమతి దక్కింది. బిగ్ టికెట్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు తొలుత నమ్మలేకపోయానని గీవర్గీస్ తెలిపారు. భారత్‌లో ఉన్న తన కుటుంబం కోసం గెలుచుకున్న మొత్తాన్ని పొదుపు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.
కేరళకు చెందిన 39 ఏళ్ల నర్సు మణికంఠన్ మోహనన్ మణియన్ మోహనన్ కు మాత్రం అదృష్టం రెండో ప్రయత్నంలోనే కలిసొచ్చింది. అబుదాబి విమానాశ్రయంలోని బిగ్ టికెట్ స్టోర్‌లో టికెట్ కొనుగోలు చేశారు. రెండోసారి టికెట్ కొనుగోలు చేసిన వెంటనే Dh25,000 బహుమతి రావడంతో సంతోషానికి గురయ్యారు. బహుమతి మొత్తాన్ని ఎలా వినియోగించాలనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అయితే పొదుపు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.
ఆగస్టు ప్రమోషన్ చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో బిగ్ టికెట్ వారపు డ్రాల్లో విజేతల సంఖ్య పెరుగుతోంది. సెప్టెంబర్ 3న జరిగే లైవ్ డ్రాలో ఈ నెలలో అత్యంత భారీ బహుమతి Dh15 మిలియన్లు ఒక విజేతకు దక్కనుంది. అదే డ్రాలో మరో ఐదుగురు విజేతలకు ఒక్కొక్కరికి Dh100,000 చొప్పున బహుమతులు అందనున్నాయని నిర్వాహకులు ప్రకటించారు.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్‌పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







