సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- August 26, 2026
రియాద్: సౌదీ అరేబియా జూన్‌లో నాన్-ఆయిల్ ఎగుమతులు గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 11.4 శాతం తగ్గాయి. సౌదీ జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. జూన్‌లో మొత్తం వస్తు వాణిజ్య మిగులు ఏడాది ప్రాతిపదికన 10 శాతం తగ్గుదల నమదైంది. మొత్తం వస్తువుల ఎగుమతులు 4.5 శాతం, దిగుమతులు 3 శాతం తగ్గాయి.రీ-ఎగుమతులను కలుపుకొని మొత్తం నాన్-ఆయిల్ ఎగుమతులు 9.7 శాతం తగ్గగా, రీ-ఎగుమతులు 6.7 శాతం పడిపోయాయి. యంత్రాలు, విద్యుత్ పరికరాలు, వాటి విడిభాగాల రీ-ఎగుమతుల్లో ఏకంగా 41.7 శాతం క్షీణత నమోదైంది. మొత్తం రీ-ఎగుమతుల్లో ఈ విభాగం వాటా 36.1 శాతంగా ఉంది.
జూన్‌లో సౌదీ చమురు ఎగుమతులు 2.3 శాతం తగ్గాయి. అయినప్పటికీ మొత్తం ఎగుమతుల్లో చమురు వాటా 72 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే సమయంలో ఈ వాటా 70.4 శాతంగా ఉండేది. నాన్-ఆయిల్ ఎగుమతులు, రీ-ఎగుమతులను కలిపి దిగుమతులతో పోల్చిన నిష్పత్తి కూడా 2025 జూన్‌లోని 37.5 శాతం నుంచి 34.9 శాతానికి పడిపోయింది.
అలాే ప్లాస్టిక్స్, రబ్బర్, వాటి ఉత్పత్తులు సౌదీ నాన్-ఆయిల్ ఎగుమతుల్లో కీలకంగా నిలిచాయి. మొత్తం నాన్-ఆయిల్ ఎగుమతుల్లో వీటి వాటా 20.7 శాతం కాగా, ఏడాది ప్రాతిపదికన 12.8 శాతం తగ్గాయి. కెమికల్ ఉత్పత్తులు, సంబంధిత పరిశ్రమల ఉత్పత్తులు మొత్తం నాన్-ఆయిల్ ఎగుమతుల్లో 19.2 శాతం వాటా కలిగి ఉండగా, ఈ విభాగం ఎగుమతులు ఏకంగా 30.4 శాతం తగ్గాయి. ఇక దిగుమతుల విషయానికి వస్తే యంత్రాలు, విద్యుత్ పరికరాలు, వాటి విడిభాగాలు మొత్తం దిగుమతుల్లో 25.7 శాతం వాటా కలిగి ఉండగా, ఈ విభాగం దిగుమతులు 20.4 శాతం తగ్గాయి. మరోవైపు కెమికల్ ఉత్పత్తుల దిగుమతులు 30.5 శాతం పెరిగాయి.
జపాన్‌కు అత్యధిక ఎగుమతులు
జూన్‌లో సౌదీ అరేబియా వస్తు ఎగుమతులకు జపాన్ అతిపెద్ద మార్కెట్‌గా నిలిచింది. మొత్తం ఎగుమతుల్లో జపాన్ వాటా 13.2 శాతం. ఆ తర్వాత దక్షిణ కొరియా 11.5 శాతం, చైనా 9.4 శాతంతో ఉన్నాయి. సౌదీ అరేబియా మొత్తం ఎగుమతుల్లో టాప్-10 దేశాల వాటా 67.1 శాతంగా ఉంది. దిగుమతుల విషయంలో చైనా అగ్రస్థానంలో ఉంది. సౌదీ మొత్తం దిగుమతుల్లో చైనా వాటా 22 శాతం కాగా, స్విట్జర్లాండ్ 8.4 శాతం, అమెరికా 8.3 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. టాప్-10 దిగుమతి వనరుల నుంచి వచ్చిన సరుకులు మొత్తం దిగుమతుల్లో 65.2 శాతంగా ఉన్నాయి.
సౌదీ అరేబియాలో దిగుమతుల ప్రధాన ప్రవేశ ద్వారంగా జెడ్డా ఇస్లామిక్ పోర్టు నిలిచింది. దేశ మొత్తం దిగుమతుల్లో 37.2 శాతం ఈ పోర్టు ద్వారా వచ్చాయి. ఐదు ప్రధాన కస్టమ్స్ పోర్టులు కలిపి మొత్తం వస్తు దిగుమతుల్లో 76.9 శాతం నిర్వహించాయి. నాన్-ఆయిల్ ఎగుమతుల్లోనూ జెడ్డా ఇస్లామిక్ పోర్టుదే అగ్రస్థానం. మొత్తం నాన్-ఆయిల్ ఎగుమతుల్లో 31.9 శాతం ఈ పోర్టు ద్వారా జరిగాయి. ఐదు ప్రధాన పోర్టులు కలిపి నాన్-ఆయిల్ వస్తు ఎగుమతుల్లో 64.5 శాతం నిర్వహించాయని గణంకాల్లో వెల్లడించారు.
తాజా వార్తలు
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం







