కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- August 26, 2026
కువైట్ : కువైట్ కేపిటల్ గవర్నరేట్ పరిధిలో భద్రతా అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. కేపిటల్ గవర్నరేట్ సెక్యూరిటీ డైరెక్టరేట్, కువైట్ మున్సిపాలిటీ, పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సంయుక్తంగా చేపట్టిన ఈ తనిఖీల్లో 187 మందిని అరెస్ట్ చేశారు. క్రిమినల్ కేసులు, రెసిడెన్సీ, కార్మిక చట్టాల ఉల్లంఘనలు, ఇతర కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న వారిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 23 మందిని జ్యుడీషియల్ డిటెన్షన్ కింద, మరో నలుగురిని వీసా గడువు ముగిసిన కారణంగా అరెస్ట్ చేశారు.
అలాగే వీధుల్లో అక్రమంగా వ్యాపారం చేస్తున్న ముగ్గురు, అసాధారణ స్థితిలో ఉన్న ఒక వ్యక్తి, ఇద్దరు యాచకులు, చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలు లేని నలుగురిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో 10 మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకోగా, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 445 కేసులు నమోదు చేశారు. కువైట్ మున్సిపాలిటీ సహకారంతో 19 వదిలివేయబడిన వాహనాలను తొలగించారు.
అదేవిధంగా పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సహకారంతో నిబంధనలు ఉల్లంఘించిన ఓ రెస్టారెంట్‌ను అధికారులు మూసివేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అవసరమైన చట్టపరమైన, పరిపాలనా చర్యలు తీసుకున్నామని, తదుపరి చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించేందుకు ప్రక్రియ కొనసాగుతోందని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







