ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- August 26, 2026
దోహా: డ్రోన్ల వినియోగానికి సంబంధించిన కొత్త చట్టంపై ఖతార్ ఫోటోగ్రఫీ సెంటర్, ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (QCAA) సంయుక్తంగా అవగాహన సదస్సు నిర్వహించాయి. దోహాలోని కల్చరల్ విలేజ్ ఫౌండేషన్–కటారా వద్ద ఉన్న ఫోటోగ్రఫీ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరిగింది.
2026 నంబర్ 10 చట్టం ప్రకారం.. డ్రోన్లకు సంబంధించిన లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరాలు, నిర్వహణ విధానాలు, డ్రోన్ వినియోగదారుల బాధ్యతలు, నిబంధనలపై సదస్సులో పాల్గొన్న వారికి వివరించారు. డ్రోన్ టెక్నాలజీని సురక్షితంగా, బాధ్యతాయుతంగా వినియోగించడంపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని QCAA ఎయిర్ సేఫ్టీ విభాగం డైరెక్టర్ నయీఫ్ అల్ జాబెర్ పేర్కొన్నారు. చట్టంలోని ముఖ్య నిబంధనలు, లక్ష్యాలపై ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. డ్రోన్ రంగంలో వేగంగా జరుగుతున్న మార్పులకు అనుగుణంగా చట్టపరమైన వ్యవస్థను రూపొందించినట్లు ఆయన తెలిపారు. డ్రోన్ల వినియోగం ఆమోదించిన నిబంధనలు, ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ఈ చట్టం రూపొందించామని వివరించారు.
డ్రోన్ రంగం అభివృద్ధి, పెట్టుబడులు, ఆవిష్కరణలను ప్రోత్సహించడంతో పాటు ప్రజల భద్రత, వ్యక్తిగత గోప్యత, గగనతలం, ఆస్తుల రక్షణకు సమతుల్యత కల్పించడం చట్టం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. చట్టంలో డ్రోన్లకు సంబంధించిన నిర్వచనాలు, లైసెన్సులు, అనుమతుల విధానం, తప్పనిసరి రిజిస్ట్రేషన్, డ్రోన్ల నిర్వహణకు సంబంధించిన నిబంధనలను సమగ్రంగా పొందుపరిచారు. వ్యక్తులు, కంపెనీలు, సంబంధిత సంస్థల హక్కులు, విధులు, బాధ్యతలతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన వారికి విధించే జరిమానాలు, శిక్షలను కూడా చట్టంలో పొందుపరిచారు.
ఫోటోగ్రాఫర్లు, డ్రోన్ టెక్నాలజీపై ఆసక్తి ఉన్నవారికి చట్టపరమైన అవసరాలు, అనుమతులు, అధికారిక విధానాలపై అవగాహన కల్పించడం ద్వారా ఖతార్‌లో డ్రోన్లను సురక్షితంగా, బాధ్యతాయుతంగా వినియోగించేలా చేయడమే కార్యక్రమం లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







