సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- August 26, 2026
మస్కట్: ఒమన్‌కు చెందిన తక్కువ ఖర్చు విమానయాన సంస్థ సలామ్‌ఎయిర్, సలాలాలో తొలిసారిగా ప్రత్యేక విమాన బేస్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ధోఫార్ గవర్నరేట్ నుంచి అంతర్జాతీయ నగరాలకు నేరుగా విమాన కనెక్టివిటీ మరింత బలోపేతం కానుంది. సలాలా కేంద్రంగా ప్రారంభమయ్యే ఈ విమాన కార్యకలాపాల్లో తొలిదశలో సౌదీ అరేబియాలోని జెడ్డా, బంగ్లాదేశ్‌లోని చటోగ్రామ్, భారత్‌లోని కాలికట్ (కోజికోడ్) నగరాలకు నేరుగా విమానాలు నడపనున్నారు.
ఈ విమానాలకు ఆగస్టు 26 నుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. శీతాకాల విమాన షెడ్యూల్లో భాగంగా అక్టోబర్ చివరి వారం నుంచి సర్వీసులు ప్రారంభం కానున్నట్లు సలామ్‌ఎయిర్ తెలిపింది. 2026 ఖరీఫ్ సీజన్లో సలాలాకు పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సలామ్‌ఎయిర్ ఇప్పటికే మస్కట్–సలాలా మార్గంలో విమానాల సంఖ్యను పెంచింది. పీక్ సీజన్లో రోజుకు 15 వరకు విమానాలు నడిపి, వేలాది అదనపు సీట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఒమన్ పౌరులకు ప్రత్యేక ఛార్జీలను కూడా అందించింది. మస్కట్–సలాలా వన్‌వే టికెట్ ధరలు 9.99 ఒమన్ రియాల్స్ నుంచి అందుబాటులో ఉంచినట్లు సంస్థ తెలిపింది. కొత్త సలాలా బేస్ ద్వారా ఖరీఫ్ సీజన్‌కే పరిమితం కాకుండా ఏడాది పొడవునా ధోఫార్‌లోని స్థానికులు, ప్రవాసులకు మెరుగైన అంతర్జాతీయ ప్రయాణ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. సలామ్ఎయిర్కు చెందిన ఎయిర్‌బస్ A320neo, A321neo విమానాలతో ఈ కార్యకలాపాలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం సంస్థ వద్ద మొత్తం 18 విమానాలు ఉన్నాయని తెలిపింది.
సలామ్‌ఎయిర్ సీఈఓ అడ్రియన్ హామిల్టన్-మాన్స్ మాట్లాడుతూ.. వరుస ఖరీఫ్ సీజన్లలో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా విమానాల సంఖ్యను, సరసమైన ప్రయాణ అవకాశాలను పెంచామని చెప్పారు. సలాలాలో ప్రత్యేక విమాన బేస్ ఏర్పాటు చేయడం సంస్థకు కీలక మైలురాయిగా అభివర్ణించారు.
వింటర్ సీజన్లో సలాలా నుంచి కజకిస్థాన్‌లోని అస్తానా, అల్మాటీ నగరాలకు కూడా చార్టర్ విమానాలు నడపనున్నారు. మధ్య ఆసియా నుంచి పర్యాటకులను ఆకర్షించడంతో పాటు ఖరీఫ్ సీజన్ తర్వాత కూడా సలాలాను పర్యాటక గమ్యస్థానంగా ప్రోత్సహించేందుకు ఈ సర్వీసులు దోహదపడనున్నాయి.
సలాలా బేస్ ఏర్పాటు సలామ్‌ఎయిర్ విస్తరణ వ్యూహంలో భాగమని సంస్థ తెలిపింది. ఒమన్‌లోని కీలక విమానాశ్రయాల నుంచి నెట్‌వర్క్‌ను విస్తరించడం, తక్కువ విమాన సర్వీసులు ఉన్న మార్కెట్లకు కనెక్టివిటీ పెంచడం, కొత్త ప్రయాణ డిమాండ్‌ను సృష్టించడం ఈ వ్యూహంలో భాగమని పేర్కొంది.
తాజా వార్తలు
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్







