ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్‌కే ప్రాధాన్యం..!!
- August 27, 2026
దుబాయ్: యూఏఈ, గల్ఫ్ దేశాల్లో ఉద్యోగులు ఆఫీసుల్లో ఫ్రీ ఫుడ్, ఇతర ఆకర్షణీయ సౌకర్యాల కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఉద్యోగుల సంక్షేమం, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్, పెయిడ్ లీవ్ వంటి ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని NAVO తాజా వర్క్‌ప్లేస్ అధ్యయనం వెల్లడించింది.
ఈ పరిశోధనలో ఉద్యోగ ప్రకటనలు, కంపెనీల కెరీర్ పేజీలు, లింక్డ్‌ఇన్ పోస్టులు సహా 2వేల మంది యజమానులకు సంబంధించిన వనరులను విశ్లేషించారు. అలాగే Glassdoor, Indeed, Reddit, Blind, Fishbowl వంటి ప్లాట్‌ఫామ్‌లలోని 1,000కుపైగా ఉద్యోగుల సమీక్షలు, చర్చలను కూడా పరిశీలించారు. డూప్లికేట్, సాధారణ ప్రస్తావనలను తొలగించిన తర్వాత మొత్తం 1,121 వర్క్‌ప్లేస్ ప్రయోజనాల ప్రస్తావనలను తుది డేటాలో చేర్చారు.
హెల్త్ బెనిఫిట్స్‌కు అగ్రస్థానం
అధ్యయనంలో హెల్త్ బెనిఫిట్స్ 124 ప్రస్తావనలతో మొదటి స్థానంలో నిలిచాయి. ఆ తర్వాత ఉద్యోగుల సంక్షేమం 122, ఫ్లెక్సిబిలిటీ–రిమోట్ వర్క్ 111 ప్రస్తావనలతో ఉన్నాయి. పెయిడ్ లీవ్ 101 ప్రస్తావనలతో నాలుగో స్థానంలో, ఆర్థిక, రిటైర్మెంట్ ప్రయోజనాలు 90, ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ 75 ప్రస్తావనలతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
మానసిక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిపి చూస్తే వెల్‌బీయింగ్ మొత్తం 179 ప్రస్తావనలతో అతిపెద్ద అంశంగా మారిందని అధ్యయనం తెలిపింది. హెల్త్ బెనిఫిట్స్‌లో మెడికల్ ఇన్సూరెన్స్, ప్రైవేట్ మెడికల్ కవరేజ్, యాజమాన్యం భరించే ఆరోగ్య సేవలు ఉన్నాయి. వెల్‌బీయింగ్‌లో వివిధ ఆరోగ్య, సంక్షేమ కార్యక్రమాలను చేర్చారు.
ఫ్లెక్సిబుల్ వర్కింగ్‌కు డిమాండ్
ఫ్లెక్సిబుల్ వర్కింగ్, రిమోట్ వర్క్‌కు సంబంధించి 111 ప్రస్తావనలు నమోదయ్యాయి. ఇందులో హైబ్రిడ్ వర్క్ షెడ్యూల్స్, ఇంటి నుంచి పని, ఫ్లెక్సిబుల్ అవర్స్, నాలుగు రోజుల పని దినాలు వంటి అంశాలు ఉన్నాయి.అలాగే వార్షిక సెలవులు, పేరెంటల్ లీవ్, సిక్ లీవ్ తదితర పెయిడ్ లీవ్ అంశాలకు 101 ప్రస్తావనలు రావడం ద్వారా ఉద్యోగులు వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కు ఇస్తున్న ప్రాధాన్యం స్పష్టమవుతోందని నివేదిక పేర్కొంది.
డెస్క్, కుర్చీలపైనా ఉద్యోగులే ఎక్కువగా టాక్స్
యాజమాన్యాలు ప్రచారం చేసే ప్రయోజనాలు, ఉద్యోగులు స్వయంగా ప్రస్తావించే అంశాల మధ్య కూడా గణనీయమైన తేడా ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది. స్టాండింగ్ డెస్క్‌లు, ఎర్గోనామిక్ వర్క్‌స్టేషన్లపై వచ్చిన 80 శాతానికి పైగా ప్రస్తావనలు ఉద్యోగుల నుంచే వచ్చాయి. ఈ విభాగంలో మొత్తం 56 ప్రస్తావనలు ఉండగా, 45 ఉద్యోగుల నుంచి, కేవలం 11 యాజమాన్యాల నుంచి వచ్చాయి.
సాధారణ డెస్క్‌లు, కుర్చీల విషయంలోనూ దాదాపు ఐదింట నాలుగు ప్రస్తావనలు ఉద్యోగుల నుంచే వచ్చినట్లు నివేదిక తెలిపింది. అయితే ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు, లైఫ్ అండ్ డిసెబిలిటీ ఇన్సూరెన్స్ వంటి అంశాలను ప్రధానంగా యాజమాన్యాలే ప్రస్తావించినట్లు వెల్లడించింది.
ఫ్రీ ఫుడ్ కు చివరి స్థానం
ఉద్యోగులను ఆకర్షించేందుకు కంపెనీలు తరచూ ఫ్రీ ఫుడ్స్, స్నాక్స్‌ను ప్రోత్సాహకంగా చూపుతున్నప్పటికీ, అధ్యయనంలో ఇవి చివరి స్థానంలో నిలిచాయి. మొత్తం కేవలం 6 ప్రస్తావనలు మాత్రమే నమోదయ్యాయి. అయితే తక్కువ ప్రస్తావనలు ఉన్నంత మాత్రాన ఉద్యోగులు ఆ ప్రయోజనాలను విలువైనవిగా భావించడం లేదని అర్థం చేసుకోరాదని NAVO సూచించింది.
హెల్త్ కవరేజ్, పెయిడ్ లీవ్ వంటి కొన్ని ప్రయోజనాలను ఉద్యోగులు ఇప్పుడు ప్రత్యేక సౌకర్యాలుగా కాకుండా ఉద్యోగంలో ప్రాథమికంగా ఉండాల్సిన అంశాలుగా భావిస్తుండవచ్చని పేర్కొంది.
ఈ పరిశోధనలో యూఏఈ, జీసీసీ ప్రాంతాలకు చెందిన 320 యజమానుల వనరులు ఉన్నాయి. అయితే ఈ ఫలితాలను ఏదైనా ఒక దేశానికి మాత్రమే వర్తించే నిర్ధారణగా కాకుండా, విస్తృత గల్ఫ్ వర్క్‌ప్లేస్ ట్రెండ్స్‌గా చూడాలని NAVO స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్‌కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







