విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- August 27, 2026
రియాద్: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో విద్యార్థుల రవాణా సేవలను అందించే లైసెన్స్ పొందిన, అధికారికంగా అనుమతి ఉన్న ఆపరేటర్లతోనే పేరెంట్స్ డీల్స్ చేసుకోవాలని సౌదీ అరేబియా ట్రాన్స్‌పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) సూచించింది. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది.
వివిధ మార్గాలు, సదుపాయాల ద్వారా అందుబాటులో ఉన్న నియంత్రిత, లైసెన్స్ పొందిన విద్యార్థుల రవాణా సేవలను తల్లిదండ్రులు వినియోగించుకోవాలని TGA కోరింది. అనుమతి లేని రవాణా ఆపరేటర్లను ఆశ్రయించవద్దని హెచ్చరించింది. ఇలాంటి సేవలు విద్యార్థుల భద్రతకు ప్రమాదం కలిగించే అవకాశం ఉందని పేర్కొంది.
లైసెన్స్ బస్సులను ఎలా గుర్తించాలి?
లైసెన్స్ పొందిన విద్యార్థుల రవాణా బస్సులను సులభంగా గుర్తించేందుకు పలు ప్రత్యేక గుర్తులు ఉంటాయని TGA తెలిపింది. ఎల్లో కలర్ నంబర్ ప్లేట్, బస్సుకు ఇరువైపులా స్టాప్ ఆర్మ్, కస్టమర్ సర్వీస్ సంప్రదింపు నంబర్, బస్సు ముందు, వెనుక భాగాల్లో సర్వీస్ ప్రొవైడర్ లైసెన్స్ నంబర్, ఆపరేటింగ్ కార్డ్ నంబర్, బస్సు నంబర్ ద్వారా గుర్తించవచ్చని పేర్కొంది.
కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థుల రవాణా రంగంపై TGA తనిఖీలు, పర్యవేక్షణను కొనసాగిస్తోంది. చట్టాలు, నిబంధనలు, నిర్దేశిత ప్రమాణాలు అమలవుతున్నాయో పరిశీలించడంతోపాటు ఉల్లంఘనలను గుర్తించి అవసరమైన నియంత్రణ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







