కువైట్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- August 28, 2026
కువైట్ : కువైట్‌లో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద డ్రగ్స్ ఆపరేషన్‌ను అధికారులు భగ్నం చేశారు. ‘లారికా’ పేరుతో మాదకద్రవ్యాల తయారీ, విక్రయాలకు పాల్పడుతున్న ముఠాను గుర్తించి పలువురు అనుమానితులను అరెస్ట్ చేశారు. డిప్యూటీ ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ యూసుఫ్ సౌద్ అల్-సబాహ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో నార్కోటిక్స్ కంట్రోల్ విభాగం ఈ ఆపరేషన్ చేపట్టింది.
అధికారుల వివరాల ప్రకారం.. దాదాపు 5 టన్నుల లారికా రా పౌడర్, పంపిణీకి సిద్ధంగా ఉన్న 40 లక్షల క్యాప్సూల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు మాదకద్రవ్యాల తయారీకి పూర్తిస్థాయిలో సిద్ధం చేసిన ఫ్యాక్టరీని కూడా గుర్తించి సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలు, ఫ్యాక్టరీ తదితరాల మార్కెట్ విలువ సుమారు 150 మిలియన్ కువైట్ దినార్లు (KD) ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కువైట్ చరిత్రలో ‘లారికా’ తయారీ, విక్రయాలకు సంబంధించి ఇదే అతిపెద్ద ఆపరేషన్ అని అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది.
కొత్తగా అమల్లోకి వచ్చిన నార్కోటిక్స్ కంట్రోల్ చట్టం కువైట్‌లో డ్రగ్స్ అక్రమ రవాణాపై నిరోధక వ్యవస్థను మరింత బలోపేతం చేసిందని షేక్ ఫహద్ తెలిపారు. ఈ చట్టం డ్రగ్స్ అక్రమ రవాణాదారుల్లో భయాన్ని పెంచిందని పేర్కొన్నారు. సమాజాన్ని మాదకద్రవ్యాల ముప్పు నుంచి రక్షించేందుకు భద్రతా చర్యలను మరింత ముమ్మరం చేసి, చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని కువైట్ అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







