భారత్‌తో సహా 10 దేశాలను సుంకాలతో టార్గెట్ చేసిన ట్రంప్
- August 28, 2026
అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ Trump అనుసరిస్తున్న వాణిజ్య విధానం గ్లోబల్ ఎకానమీ రూపురేఖలను సమూలంగా మార్చివేస్తోంది. సుంకాలను (Tariffs) కేవలం దిగుమతులు, ఎగుమతులు, వాణిజ్య లోటును తగ్గించేందుకు మాత్రమే కాకుండా.. అంతర్జాతీయ విదేశాంగ విధానంలో ఇతర దేశాలను లొంగదీసుకునే ప్రధాన ఆయుధంగా అమెరికా ఉపయోగిస్తోంది. రష్యా చమురు కొనుగోళ్లు, అక్రమ వలసలు, మాదకద్రవ్యాల స్మగ్లింగ్, ఫెంటానిల్ నియంత్రణ, అణు కార్యక్రమాలు, జాతీయ భద్రత వంటి కీలక భౌగోళిక రాజకీయ సమస్యలపై వివిధ దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు వాషింగ్టన్ సుంకాలు, ఆంక్షలను యథేచ్ఛగా ప్రయోగిస్తోంది. దీనివల్ల భారత్, చైనా, కెనడాతో పాటు యూరప్ దేశాల సరఫరా గొలుసు తీవ్ర అనిశ్చితిలో పడింది. భారతదేశం విషయానికి వస్తే.. రష్యా నుండి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడమే ప్రధాన లక్ష్యంగా అమెరికా కఠిన వైఖరి అవలంబిస్తోంది.
ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన వాణిజ్య చర్చలు
భారత ఉత్పత్తులపై మొదట 25 శాతం పరస్పర సుంకాన్ని.. ఆ తర్వాత అదనంగా మరో 25 శాతం డ్యూటీని విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి తోడు బలవంతపు కార్మికులతో తయారు చేసిన వస్తువుల దిగుమతుల నిరోధం (Section 301) కింద మరో 10 శాతం సుంకం భారాన్ని భారత్ ఎదుర్కొంటోంది. కాగా ఈ ప్రతిష్టంభనను తొలగించేందుకు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇటు చైనాతో కూడా అమెరికా వివాదం తీవ్ర రూపం దాల్చింది. మారణాయుధంగా మారిన ఫెంటానిల్ రసాయనాల అక్రమ సరఫరాను అరికట్టడంలో బీజింగ్ విఫలమైందనే ఆరోపణలతో చైనా ఉత్పత్తులపై అదనపు పన్నులు పడ్డాయి.
తాజా వార్తలు
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..
- అబుదాబిలో ADIHEX 2026 ప్రారంభం..
- 8 ఏళ్ల సరయు...పాన్-అమెరికన్ చెస్ ఛాంపియన్‌గా టీమ్ యూఎస్ఏలో చోటు
- శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు
- స్టార్‌లింక్‌కు యూఏఈలో 10 ఏళ్ల లైసెన్స్
- భారత్‌తో సహా 10 దేశాలను సుంకాలతో టార్గెట్ చేసిన ట్రంప్
- ఎన్టీఏ డైరెక్టర్‌గా ఏపీ కేడర్ ఐఏఎస్‌కు కీలక బాధ్యతలు
- రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
- నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు: చైనా తీవ్ర హెచ్చరికలు!
- ‘మన దేశ గర్వకారణం’.. ఎమిరాతీ మహిళల సేవలను కొనియాడిన షేక్ మొహమ్మద్







