ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- August 28, 2026
అమరావతి: ఏపీలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఏపీ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏపీ ఉద్యోగుల నిరసన బాట పట్టారు. వివిధ ఉద్యోగ సంఘాలను కలుపుకొని ఏపీ జేఏసీ అమరావతి మూడు దశల భారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఉద్యోగుల హక్కులను కాపాడుకోవడానికి అందరూ ఐక్యంగా పోరాడాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రూపొందించిన ప్రణాళిక వివరాలు ఇలా ఉన్నాయి.
మొదటి దశ ఉద్యమ కార్యాచరణ వివరాలు
ఉద్యమ తొలి దశను ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 11 వరకు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 31న పీజీఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తారు. సెప్టెంబర్ 1న సీఎం సార్ మా డబ్బులు మాకివ్వండి అనే నినాదంతో సెల్ఫోన్ డీపీ మార్చుకొని నిరసన తెలుపుతారు. సెప్టెంబర్ 1 నుంచి 5 వరకు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారు. సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు నేరుగా కార్యాలయాలను సందర్శించి అందరినీ ఉద్యగంలో భాగస్వామ్యం చేస్తారు. సెప్టెంబర్ 3 నుంచి 5 వరకు లంచ్ సమయంలో నిరసన కార్యక్రమాలు చేపట్టి సెప్టెంబర్ 11న అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తారు.
రెండో దశ నిరసనలు
మొదటి దశ ముగిసిన వెంటనే సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు రెండో దశ ఉద్యమం ప్రారంభం కానుంది. ఈ కాలంలో ప్రభుత్వ నిబంధనలకు లోబడి వర్క్ టూ రూల్ పాటిస్తారు. సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక డీపీలు మరియు రీల్స్ ద్వారా ప్రచారం నిర్వహిస్తారు. సెప్టెంబర్ 15 నుంచి 25 మధ్య రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు మరియు ఎమ్మెల్సీలకు వినతిపత్రాలు ఇస్తారు. సెప్టెంబర్ 17న నల్ల కండువాలతో నిరసన తెలిపి, సెప్టెంబర్ 23న కలెక్టరేట్లు ఆర్డీఓ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపడతారు. సెప్టెంబర్ 26న కుటుంబ సభ్యులతో కలిసి మా డబ్బులు మాకివ్వండి అంటూ భారీ ధర్నాలు నిర్వహించి తదుపరి మూడో దశ ఉద్యటాన్ని ప్రకటిస్తారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







