దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- August 29, 2026
డెట్రాయిట్: కంటి ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు, అవసరమైన వారికి నాణ్యమైన నేత్ర వైద్య సేవలను అందించేందుకు మద్దతుగా మిచిగన్‌లోని శంకర నేత్రాలయ డెట్రాయిట్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక 5K వాక్ ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో భారతీయ-అమెరికన్ కమ్యూనిటీకి చెందిన కుటుంబాలు, చిన్నారులు, వాలంటీర్లు, స్పాన్సర్లు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కంటి ఆరోగ్యం, దృష్టి సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, శంకర నేత్రాలయ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు మద్దతు కూడగట్టడం ఈ వాక్ ప్రధాన ఉద్దేశంగా నిలిచింది.
సేవా కార్యక్రమాలకు అవగాహన
ఈ 5K వాక్ కేవలం ఆరోగ్యకరమైన నడక కార్యక్రమంగా మాత్రమే కాకుండా, శంకర నేత్రాలయ సేవా లక్ష్యాలు, సామాజిక బాధ్యత, ఉచిత మరియు సేవా ఆధారిత నేత్ర వైద్య కార్యక్రమాలపై కమ్యూనిటీలో అవగాహన కల్పించే వేదికగా నిలిచింది.
కార్యక్రమంలో కనిపించిన ఉత్సాహం, సేవాభావం, అంకితభావం నిర్వాహకులను ఆకట్టుకుంది. అవసరమైన వారికి మెరుగైన నేత్ర వైద్య సేవలు అందించేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరమని నిర్వాహకులు తెలిపారు.
నిర్వాహకులు, వాలంటీర్ల కృషి
5K వాక్ విజయవంతం కావడంలో శంకర నేత్రాలయ డెట్రాయిట్ చాప్టర్ బృందం కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా ప్రతిమ కొడాలి, రమణ ముదిగంటి, విజయ్ పెరుమాళ్ల, రవి కవుతరపు, వెంకట్ గోటూర్, త్రిపుర సుందరి భాగవతుల సమన్వయం, ముందస్తు ప్రణాళిక, నిరంతర కృషిని నిర్వాహకులు అభినందించారు.
అలాగే వాలంటీర్లుగా సేవలందించిన సాయి గోపిసెట్టి, శిరీషా ఉప్పలపాటి, రజని బేతిన, అనిత బొమ్మనవేని కృషి కూడా ప్రశంసనీయమని తెలిపారు.
వారి అంకితభావం, కమ్యూనిటీతో ఉన్న బలమైన అనుబంధం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో ఎంతో దోహదపడింది.
విజేతలకు మెడల్స్..వాలంటీర్లు, స్పాన్సర్లకు సత్కారం
5K వాక్‌లో పెద్ద సంఖ్యలో కుటుంబాలు, చిన్నారులు, కమ్యూనిటీ సభ్యులు పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. ఆహ్లాదకర వాతావరణంలో సాగిన కార్యక్రమంలో విజేతలకు మెడల్స్ అందజేశారు.
అదేవిధంగా కార్యక్రమం విజయానికి విలువైన సహకారం అందించిన వాలంటీర్లు, స్పాన్సర్లను సత్కరించి వారి సేవలను నిర్వాహకులు అభినందించారు.
ప్రతి సహకారం ఒక జీవితంలో వెలుగు
పాల్గొనడం, వాలంటీర్‌గా సేవ చేయడం, స్పాన్సర్ చేయడం లేదా విరాళం అందించడం.. ఇలా ప్రతి చిన్న సహకారం కూడా ఒకరి జీవితంలో వెలుగును నింపగలదని నిర్వాహకులు సందేశం ఇచ్చారు. అవసరమైన వారికి మెరుగైన దృష్టిని అందించి, వారి భవిష్యత్తులో కొత్త ఆశను కల్పించేందుకు సమాజం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ డెట్రాయిట్ చాప్టర్ కృతజ్ఞతలు తెలిపింది. పాల్గొన్న వారు, వాలంటీర్లు, స్పాన్సర్లు, మద్దతుదారులు, శ్రేయోభిలాషుల నిరంతర సహకారంతో కంటి ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, అవసరమైన వారికి నాణ్యమైన నేత్ర వైద్య సేవలను అందించడం మరింత ముందుకు తీసుకెళ్లగలమని పేర్కొంది.
బాలా రెడ్డి ఇందుర్తి నాయకత్వానికి ప్రశంసలు
శంకర నేత్రాలయ డెట్రాయిట్ చాప్టర్ అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందుర్తితో పాటు నాయకత్వ బృందం అందించిన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం, నిరంతర సహకారం కార్యక్రమ విజయానికి కీలకంగా నిలిచాయి. వారి నాయకత్వాన్ని నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించారు.
కంటి ఆరోగ్యం కోసం సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన ఈ 5K వాక్.. సేవా కార్యక్రమాలకు కమ్యూనిటీ భాగస్వామ్యం ఎంత ముఖ్యమో మరోసారి చాటిచెప్పింది.

తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







