బహ్రెయిన్‌లో ఆన్‌లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- August 29, 2026
మనామా: బహ్రెయిన్‌లో అధికారికంగా ప్రకటించని ఈవెంట్ల పేరుతో సోషల్ మీడియాలో టికెట్లు విక్రయిస్తున్న నకిలీ ఖాతాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. బహ్రెయిన్‌లో ఈవెంట్లకు సంబంధించిన సమాచారం అందించే క్యాలెండర్ బహ్రెయిన్ ఈ హెచ్చరికను జారీ చేసింది. ఇటీవల ఓ ఆన్‌లైన్ ఖాతా.. ప్రముఖ అమెరికన్ పాప్ బ్యాండ్ బ్యాక్‌స్ట్రీట్ బాయ్స్ బహ్రెయిన్‌లో ప్రదర్శన ఇవ్వనున్నట్లు ప్రచారం చేసింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన టికెట్లను BD25 నుంచి BD150 వరకు విక్రయిస్తున్నట్లు ప్రకటనలు చేసింది.
ఈ ప్రకటనలను నమ్మి కొంతమంది టికెట్లు కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే బహ్రెయిన్‌లో ఈ కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ తరహా మోసాలకు గురికాకుండా ప్రజలు ఈవెంట్లకు సంబంధించిన సమాచారాన్ని అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా మాత్రమే ధృవీకరించుకోవాలని క్యాలెండర్ బహ్రెయిన్ సూచించింది.
అధికారికంగా ప్రకటించని ఈవెంట్లకు సంబంధించిన టికెట్లను విక్రయించే ఖాతాలు, వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. అధికారిక ఖాతాలను ఫాలో అవుతూ నకిలీ లేదా ఇంపర్సనేటర్ ఖాతాల ద్వారా వచ్చే సమాచారాన్ని నమ్మవద్దని హెచ్చరించింది.
ఎక్కడ అధికారిక ప్రకటనలు వస్తాయి?
బహ్రెయిన్‌లో జరిగే అధికారిక కాన్సర్టులు, ఇతర కార్యక్రమాలకు సంబంధించిన ప్రకటనలు @beyon_aldana, @calendar.bahrain ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో ప్రచురించబడతాయని క్యాలెండర్ బహ్రెయిన్ స్పష్టం చేసింది. అధికారిక ప్రకటన లేకుండా టికెట్లు కొనుగోలు చేస్తే డబ్బులు కోల్పోయే ప్రమాదం ఉన్నందున.. ఈవెంట్ నిర్వాహకులు, టికెట్ వివరాలు, చెల్లింపు ఖాతాలను ముందుగానే ధృవీకరించుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







