కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- August 29, 2026
కువైట్: ఇంటి నుంచే అనుమతి లేని ఇంజెక్షన్ సేవలు అందిస్తున్నారన్న ఆరోపణలపై ఓ మహిళా డాక్టర్ ను అధికారులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో అనుమతి లేని వైద్య పదార్థాలతో ఇంజెక్షన్ సేవలు అందిస్తున్నట్లు ప్రకటనలు చేసినట్లు అధికారులు గుర్తించారు.
కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (PAM)కు చెందిన లేబర్ ఇన్స్పెక్షన్ విభాగం చేపట్టిన తనిఖీలు, పర్యవేక్షణలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జనరల్ ప్రాక్టీషనర్‌గా పనిచేస్తున్న సదరు వైద్యురాలు అల్-మసాయెల్ ప్రాంతంలోని తన ఇంటి నుంచి ఈ సేవలు అందిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ వ్యవహారంపై PAM.. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మెడికల్ లైసెన్సింగ్ విభాగం, డ్రగ్ ఇన్స్పెక్షన్ విభాగాలతో సమన్వయం చేసింది. సంబంధిత అధికారుల నుంచి అవసరమైన అనుమతులు పొందిన అనంతరం మహిళా వైద్యురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై చట్టపరమైన, పరిపాలనా చర్యలు ప్రారంభించి.. తదుపరి చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించారు.
కార్మిక మార్కెట్, వృత్తిపరమైన కార్యకలాపాలకు సంబంధించిన చట్టాలు, నిబంధనలను ఉల్లంఘించే వ్యవహారాలను గుర్తించేందుకు తనిఖీలు, పర్యవేక్షణ కొనసాగిస్తామని PAM స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







