ప్రమాదంలో భారతీయుడికి గాయాలు.. ఎయిర్ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలింపు..!!
- August 30, 2026
మస్కట్: ఒమన్‌లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన భారతీయుడిని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ఎయిర్ వింగ్ వైద్య తరలింపు ద్వారా నిజ్వా ఆస్పత్రికి తరలించింది. హైమా విలాయత్‌కు సుమారు 40 కిలోమీటర్ల దక్షిణాన ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన భారతీయుడికి అత్యవసర వైద్య సహాయం అవసరం కావడంతో ఎయిర్ వింగ్ రంగంలోకి దింపినట్లు ఆర్వోపీ తెలిపింది.
హెలికాప్టర్ ద్వారా బాధితుడిని నిజ్వా ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, గాయపడిన వ్యక్తి పరిస్థితిపై మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







