యూఏఈ లాటరీలో ఒకరికి Dh1 లక్ష జాక్‌పాట్..!!
- August 30, 2026
దుబాయ్: యూఏఈ లాటరీ నిర్వహించిన తాజా ‘లక్కీ డే డ్రా’లో ఓ విజేత ఏకంగా Dh100,000 గెలుచుకున్నాడు. ఆగస్టు 29న జరిగిన డ్రాలో మొత్తం 7,379 మంది వివిధ మొత్తాల్లో నగదు బహుమతులు అందుకున్నారు. డ్రా నంబర్ 260829లో ‘డేస్’ విభాగంలో గెలుపు నంబర్లు 8, 14, 13, 23, 20, 9గా ప్రకటించారు. ‘మంత్స్’ విభాగంలో లక్కీ నంబర్ 7గా వచ్చింది.
డేస్ విభాగంలోని ఐదు నంబర్లతో పాటు మంత్స్ విభాగంలోని లక్కీ నంబర్‌ను సరిపోల్చిన ఓ విజేతకు Dh100,000 బహుమతి దక్కింది. మరో 49 మంది విజేతలు చెరో Dh1,000, 7,326 మంది చెరో Dh100 చొప్పున బహుమతులు గెలుచుకున్నారు. డ్రాలో నిర్వహించిన లక్కీ ఛాన్స్ రాఫెల్ ద్వారా మరో ముగ్గురు విజేతలు చెరో Dh50,000 గెలుచుకున్నారు. విజేత ఐడీలు CU7141172, AJ0816047, BL3617165గా ప్రకటించారు. ఈ ముగ్గురికి కలిపి మొత్తం Dh150,000 నగదు బహుమతిగా లభించింది.
Dh30 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్
యూఏఈ లాటరీ ప్రతి బుధవారం, శనివారం రాత్రి 9.30 గంటలకు లక్కీ డే డ్రాను నిర్వహిస్తోంది. మొత్తం ఆరు ప్రధాన నంబర్లు, లక్కీ నంబర్‌ను సరిగ్గా సరిపోల్చిన వారికి Dh30 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. అన్ని ఆరు ప్రధాన నంబర్లు సరిపోల్చిన వారికి Dh5 మిలియన్ల రెండో బహుమతి, ఐదు ప్రధాన నంబర్లతో పాటు లక్కీ నంబర్ సరిపోల్చిన వారికి Dh100,000 బహుమతి అందజేస్తారు. ప్రతి డ్రాలో ముగ్గురు లక్కీ ఛాన్స్ విజేతలను ఎంపిక చేసి, ఒక్కొక్కరికి Dh50,000 చొప్పున అందిస్తారు.
యూఏఈ లాటరీ జనరల్ కమర్షియల్ గేమింగ్ రెగ్యులేటరీ అథారిటీ (GCGRA) నియంత్రణలో పనిచేస్తుందని, పాల్గొనేవారిలో బాధ్యతాయుతమైన గేమింగ్‌ను ప్రోత్సహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆగస్టులో జరిగిన మునుపటి డ్రాలో 5,579 మంది బహుమతులు గెలుచుకున్నారు. వారిలో ఒకరు ఐదు డేస్ నంబర్లు, లక్కీ మంత్స్ నంబర్ సరిపోల్చి Dh100,000 గెలుచుకున్నారు.
2026 ఏప్రిల్‌లో యూఏఈ లాటరీ కొత్త ఫార్మాట్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఇద్దరు గ్రాండ్ ప్రైజ్ విజేతలు నిలిచారు. వారిలో అబుదాబికి చెందిన నేపాలీ నివాసితుడు, 52 ఏళ్ల భారతీయ ప్రవాసి ఉన్నారు. వీరిద్దరూ ఐదు వారాల వ్యవధిలో గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఈ నెల ప్రారంభంలో మరో వ్యక్తి Dh5 మిలియన్ల రెండో బహుమతి గెలుచుకున్నాడు. కొత్త ఫార్మాట్ ప్రారంభమైన తర్వాత ఈ బహుమతి గెలుచుకున్న మూడో వ్యక్తిగా నిలిచాడు.
ఇదిలా ఉండగా, గతంలో Dh100,000 గెలుచుకున్న భారతీయ ప్రవాసి హరిహరన్ శేఖర్ తన అనుభవాన్ని లైవ్ ప్రసారంలో పంచుకున్నారు. బోటిమ్ సూపర్‌యాప్ ద్వారా లాటరీ టికెట్ కొనుగోలు చేసిన ఆయన, పని ముగించుకుని యాప్‌ను పరిశీలించగా గెలుపు సందేశం కనిపించిందని తెలిపారు. తన భార్య, కుమార్తెలు, తండ్రి పుట్టిన తేదీలు, నెలలను ఆధారంగా చేసుకుని లాటరీ నంబర్లను ఎంచుకున్నానని హరిహరన్ వెల్లడించారు.
తాజా వార్తలు
- గ్రీన్ కార్డు కోసం 10 లక్షల మంది ఇండియన్ల ఎదురుచూపులు
- నేపాల్‌లో జలప్రళయం..675కి చేరిన మృతుల సంఖ్య
- ఖతార్‌లో పాఠశాలల పునఃప్రారంభానికి సర్వం సిద్ధం..!!
- మహ్బౌలాలో పోలీసుల తనిఖీలు.. 221 మంది అరెస్ట్..!!
- యూఏఈ లాటరీలో ఒకరికి Dh1 లక్ష జాక్‌పాట్..!!
- సౌదీ బార్డర్ దాటేందుకు ప్రయత్నించిన 1,450 మంది అరెస్ట్..!!
- ఐసీఆర్ఎఫ్ సమ్మర్ డ్రైవ్.. 4500 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ప్రమాదంలో భారతీయుడికి గాయాలు.. ఎయిర్ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలింపు..!!
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు







