మహ్బౌలాలో పోలీసుల తనిఖీలు.. 221 మంది అరెస్ట్..!!
- August 30, 2026
కువైట్: కువైట్‌లోని అల్ అహ్మది గవర్నరేట్ పరిధిలో ఉన్న మహ్బౌలా ప్రాంతంలో జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ పోలీస్ నిర్వహించిన విస్తృత భద్రతా తనిఖీల్లో 221 మంది అరెస్ట్ అయ్యారు.ఈ తనిఖీల్లో మొత్తం 790 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పబ్లిక్ సెక్యూరిటీ వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ హమద్ అహ్మద్ అల్ మునైఫీ, ట్రాఫిక్ అండ్ ఆపరేషన్స్ అఫైర్స్ సెక్టార్ అధిపతి బ్రిగేడియర్ జనరల్ అహ్మద్ ఫహద్ అల్ అజ్మీ ప్రత్యక్ష పర్యవేక్షణలో తనిఖీలు నిర్వహించారు.
మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం, నేరాలు, భద్రతకు సంబంధించిన కేసుల్లో 109 మంది వాంటెడ్ వ్యక్తులను అరెస్ట్ చేశారు. అలాగే గడువు ముగిసిన రెసిడెన్సీ పర్మిట్లు కలిగి ఉన్న 62 మందిని, చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలు వెంట ఉంచుకోని 31 మందిని అదుపులోకి తీసుకున్నారు. అనుమానస్పద స్థితిలో కనిపించిన 11 మందిని, మాదకద్రవ్యాలు మరియు మద్యం కలిగి ఉన్న మరో 8 మందిని కూడా అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. వివిధ కేసులకు సంబంధించి వాంటెడ్‌గా ఉన్న 9 వాహనాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన వ్యక్తులపై అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







