ఓ చందమామ
- August 31, 2026
నీలాకాశంలో సందడి చేస్తూ నిత్యం ఏదో సందేశం మోసుకొస్తూ నిండుగా పాలరాతి శిల్పంలా ఆ వెండి మబ్బులు నింగి అంతా తనదే అనేలా సోయగాలు,,
అనురాగాలు పంచుతూ
అనుభూతులతో అలరిస్తూ
అత్యంత ఉత్సాహంగా పరుగులు తీస్తూ
అందుకోలేవని ఊరిస్తూ,,,
కనువిందు చేస్తూ చిన్నారులని ఆకట్టుకుని
దివ్యంగా మెరుపులతో దేదీప్యమానంగా
ప్రకాశిస్తూ,జనాలని, దృష్టిని ఆకర్షిస్తూ
అమ్మో తారల నడుమ వెన్నెల కురిపిస్తూ,,,,
ఎంతో ప్రశాంతంగా అప్పుడప్పుడు
దోబూచులాడుతూ జగమంతా నిదురోయిన
తాను మాత్రం మేల్కొని,,కన్నె మనసుల్లోకి
చొరబడి,,,కలలని కనమని,,
నిశిని తరుముతూ బాట అంతా వెన్నెలతో
మార్గం సుగమం చేస్తూ,, చిరునవ్వులు చిందిస్తూ
అమృతం పంచుతూ,అలసటని మరపిస్తూ
అమావాస్య వేళ మాయమై పౌర్ణమి వేళ
కాంతివంతమైన వెలుగుతో ఆశలకి రెక్కలు
తొడిగేవు *ఓ చందమామ* ...
--యామిని కోళ్ళూరు ✍️
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







