ఖతార్‌లో బలమైన ఈదురుగాలులు.. తగ్గనున్న విజిబిలిటీ..!!
- August 31, 2026
దోహా: ఖతార్‌లో సెప్టెంబర్ 1, 2 తేదీల్లో (మంగళవారం, బుధవారం) బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఖతార్ వాతావరణ శాఖ (QMD) హెచ్చరించింది. ఈ రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా ఉత్తర-పశ్చిమ దిశ నుంచి వేగంగా గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో దుమ్ముతో కూడిన గాలులు ఏర్పడి, రహదారులపై విజిబిలిటీ గణనీయంగా తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అలాగే సముద్రంలోనూ ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండటంతో మెరైన్ వార్నింగ్ జారీ చేశారు.ప్రజలు ముఖ్యంగా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, దుమ్ము కారణంగా విజిబిలిటీ తగ్గిన సమయంలో వేగాన్ని తగ్గించి ప్రయాణించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







