నేపాల్ వరదల్లో 72 గంటలు.. కొండపై చిక్కుకున్న ఒమానీ మహిళ సేఫ్..!!
- August 31, 2026
మస్కట్: నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలో 51 ఏళ్ల ఒమానీ పర్వతారోహకురాలు ఫాతియా అల్ జద్జాలి ప్రాణాలతో బయటపడ్డారు. వరదలకు చిక్కుకుని 72 గంటల పాటు కొండపై సహాయం కోసం ఎదురుచూసిన ఆమెను నేపాల్ అధికారులు చివరకు రెండు హెలికాప్టర్ల ద్వారా రక్షించారు. యాలా పీక్‌పై ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఫాతియా.. ఆగస్టు 26న కొండ నుంచి కిందకు వస్తుండగా భారీ వరద నీరు, మట్టి ప్రవాహం గ్రామం వైపు దూసుకురావడాన్ని చూసినట్టు తెలిపారు.
తన కళ్ల ముందే హోటల్‌తో పాటు గ్రామంలోని ఇళ్లు వరదల్లో కొట్టుకుపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వరదల్లో కొట్టుకుపోతున్న ప్రజల కేకలు కూడా తాను విన్నానని, తన కళ్ల ముందే వారు మరణించారని అప్పటి భయానక సంఘటనలను గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు.
ఫాతియా మూడు రాత్రులు కొండపైనే చిక్కుకుపోయారు. తాము ప్రాణాలతో బయటపడటం ఒక అద్భుతం కంటే తక్కువ కాదని ఆమె పేర్కొన్నారు.
నేపాల్‌లోని హిమాలయ ప్రాంతాన్ని భారీ వరదలు, కొండచరియల విరిగిపడటం తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఇళ్లు, రహదారులు, వంతెనలు సహా భారీగా మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. వందలాది మంది మృతి చెందగా.. వేలాది మంది కనిపించకుండా పోయారు. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







