Dh964 షాపింగ్ బిల్లుతో 2 బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్ గెలిచిన సేల్స్‌మ్యాన్..!!
- August 31, 2026
దుబాయ్: Dh964 షాపింగ్ ఓ సేల్స్‌మ్యాన్ జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసింది. దుబాయ్‌లో పనిచేస్తున్న మొహమ్మద్ సల్మాన్ రెండు బెడ్‌రూమ్‌ల అపార్ట్‌మెంట్‌ను బహుమతిగా గెలుచుకున్నారు. దుబాయ్ ఫెస్టివల్ సిటీలో జరిగిన లైవ్ డ్రాలో తాను విజేతగా నిలిచాడు. సల్మాన్ దుబాయ్‌లోని ఓ ఆహార పదార్థాల దుకాణంలో సేల్స్‌మ్యాన్‌గా పనిచేస్తున్నారు. ఆయన మే 27న యూనియన్ కోఆపరేటివ్ సూపర్‌మార్కెట్‌లో చేసిన Dh964 బిల్లు ద్వారా విజేతగా నిలిచాడు.
ఈ డ్రా దుబాయ్ నిర్వహించిన ‘Win Your Home in Dubai’ షాపింగ్ క్యాంపెయిన్‌లో భాగంగా జరిగింది. ఈ ప్రచారంలో పాల్గొన్న దుకాణాల్లో కనీసం Dh500 విలువైన కొనుగోళ్లు చేసిన వారికి తమ కొనుగోలును రిజిస్టర్ చేసుకుని లక్కీ డ్రాలో పాల్గొనే అవకాశం కల్పించారు. మే 22న ప్రారంభమైన ఈ క్యాంపెయిన్‌లో మొత్తం 12 ఇళ్లు బహుమతులుగా అందించారు. ఇందులో 11 స్టూడియో అపార్ట్‌మెంట్లు ఉండగా, ప్రధాన బహుమతిగా రెండు బెడ్‌రూమ్‌ల అపార్ట్‌మెంట్‌ను అందించారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







