అల్ హిద్లో చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- August 31, 2026
ముహర్రక్: బహ్రెయిన్‌లోని అల్ హిద్ ప్రాంతంలో విక్రయానికి ఉంచిన ఆహార పదార్థాలను నిల్వ చేసే ఫ్రిజ్‌ను పగులగొట్టి, అందులోని వస్తువులను చోరీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఆసియా దేశాలకు చెందిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారి వయసు 62, 32 సంవత్సరాలు అని ముహర్రక్ గవర్నరేట్ పోలీసులు తెలిపారు.
చోరీపై ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు గాలింపు, దర్యాప్తు చర్యలు చేపట్టినట్లు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దర్యాప్తులో నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని, తదుపరి వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







