ఒమన్‌లో విద్యార్థుల ఆన్‌లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- September 01, 2026
మస్కట్: విద్యార్థుల ఆన్‌లైన్ బదిలీ సేవలో కొందరు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్టు ఒమన్ విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రత్యేక సాంకేతిక బృందాలు పనిచేస్తున్నట్లు పేర్కొంది. ఎలక్ట్రానిక్ విద్యార్థుల బదిలీ సేవను ఉపయోగించే సమయంలో కొందరు ఎదుర్కొన్న సాంకేతిక ఇబ్బందులను మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలించినట్లు పేర్కొంది. పోర్టల్ ను పునరుద్ధరించడంతో పాటు మెరుగైన సేవల కోసం అవసరమైన సాంకేతిక చర్యలు అమలు చేసినట్లు వెల్లడించింది.
ప్రస్తుతం దశలవారీగా సేవల పరిస్థితి మెరుగుపడుతోందని ఒమన్ విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. రోజులోనే 12వేలకు పైగా విద్యార్థుల బదిలీ లావాదేవీలు విజయవంతంగా పూర్తయ్యాయని వెల్లడించింది. తమ డిజిటల్ సేవల సామర్థ్యం, విశ్వసనీయతను నిరంతరం మెరుగుపరచేందుకు మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని తెలిపింది. విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఇతర లబ్ధిదారులకు మరింత సులభంగా, అందుబాటులో ఉండే సేవలను అందించడమే లక్ష్యమని పేర్కొంది.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







