డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- September 02, 2026
దోహా:డొమెస్టిక్ వర్కర్ల నియామకం పేరుతో సోషల్ మీడియాలో వస్తున్న నకిలీ ప్రకటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. కొన్ని అనుమతి లేని రిక్రూట్మెంట్ కార్యాలయాలు సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తూ, గుర్తింపు పొందిన నియామక సంస్థలుగా నటిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇలాంటి సంస్థల ద్వారా సేవలు పొందితే డబ్బుతో పాటు చట్టపరమైన హక్కులు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొంది.
డొమెస్టిక్ కార్మికుల నియామకానికి సంబంధించి ఎలాంటి చెల్లింపులు చేయడానికి లేదా ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ముందు సంబంధిత ఏజెన్సీకి అధికారిక అనుమతి ఉందో లేదో తప్పనిసరిగా తనిఖీ చేయాలని సూచించింది. అధికారికంగా అనుమతి పొందిన రిక్రూట్మెంట్ కార్యాలయాల జాబితాను ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో పరిశీలించవచ్చని తెలిపింది. ప్రజలు డొమెస్టిక్ కార్మికుల నియామక ప్రకటనలను వెంటనే నమ్మకుండా, ముందుగా వాటి విశ్వసనీయతను నిర్ధారించుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- ఖతార్ అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం..!!
- సౌదీ సార్వభౌమత్వ రక్షణకు రాజీ పడబోము..!!
- యూఎన్- బహ్రెయిన్ భాగస్వామ్యం.. కీలక రంగాల్లో పురోగతి..!!
- సబ్సిడీ డీజిల్ చోరీ కేసుల్లో 21 ట్యాంకర్లు, ట్రక్కులు సీజ్..!!
- కువైట్లో భారతీయ నర్సు మృతి..!!
- యూఏఈ స్కూళ్లలో స్కాలర్షిప్లు.. 50 శాతం వరకు ఫీజు రాయితీ..!!
- ది హేగ్ ఎంబసీ ఫెస్టివల్లో ఒమన్ సాంస్కృతిక వైభవం..!!
- అక్టోబర్ 7 దాడుల కథనంపై స్పందించిన ఎమిరేట్స్..!!
- సౌదీలో 5 రోజులపాటు వర్షాలు.. ప్రజలకు హెచ్చరిక..!!
- యూకేలో టెక్నికల్ ప్రాబ్లమ్.. ఖతార్ ఎయిర్వేస్ విమానాలకు అంతరాయం..!!







