బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- September 03, 2026
మనామా: బహ్రెయిన్‌లోని ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను అమెరికా రాయబారి స్టెఫానీ హాలెట్ సందర్శించారు. ఈ సందర్భంగా బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కార్యక్రమాలను పరిశీలించారు. జనరల్ డైరెక్టరేట్ ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జడ్జ్మెంట్స్ అండ్ ఆల్టర్నేటివ్ సెంటెన్సెస్ డైరెక్టర్ జనరల్ షేక్ ఖాలిద్ బిన్ రషీద్ అల్ ఖలీఫా అమెరికా రాయబారిని స్వాగతించారు.
బహ్రెయిన్-అమెరికా మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని షేక్ ఖాలిద్ ప్రస్తావించారు. వివిధ రంగాల్లో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఆయన పేర్కొన్నారు.
ఓపెన్ ప్రిజన్స్ ప్రోగ్రామ్‌లో భాగస్వాములైన వారి పునరావాసం, సమాజంలో తిరిగి కలిసిపోవడానికి చేపడుతున్న కార్యక్రమాలు, కొత్త చర్యలపై ఇరుపక్షాలు సమీక్షించాయి. అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను అనుసరించడం, పరస్పర అనుభవాలను పంచుకోవడం వంటి అంశాలపైనా చర్చించారు.
ఈ సందర్భంగా అమెరికా రాయబారి స్టెఫానీ హాలెట్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌లోని వివిధ సదుపాయాలను పరిశీలించారు. లబ్ధిదారులకు అందిస్తున్న సేవలు, శిక్షణా కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి అవకాశాల గురించి అధికారులు వివరించారు.
సమాజంలోకి తిరిగి వెళ్లేందుకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడంతో పాటు, వారు తమ కమ్యూనిటీలకు సానుకూలంగా సేవలందించేలా సిద్ధం చేయడమే ఈ కార్యక్రమాల లక్ష్యమని అధికారులు తెలిపారు.
అమెరికాలోని ప్రత్యేక సంస్థలతో, ముఖ్యంగా అమెరికన్ కరెక్షనల్ అసోసియేషన్ (ACA)తో కొనసాగుతున్న సహకారంపై కూడా చర్చించారు. ఈ సహకారం ఫలితంగా బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ ప్రోగ్రామ్‌కు ACA గుర్తింపు లభించిందని తెలిపారు. అమెరికా వెలుపల ఈ గుర్తింపు పొందిన తొలి సంస్థగా బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ ప్రోగ్రామ్ నిలిచిందని అధికారులు పేర్కొన్నారు. ఓపెన్ ప్రిజన్స్ ప్రోగ్రామ్‌లో చోటుచేసుకున్న అభివృద్ధిని, లబ్ధిదారులకు అందిస్తున్న సేవలను అమెరికా రాయబారి స్టెఫానీ హాలెట్ ఈ సందర్భంగా ప్రశంసించారు.
తాజా వార్తలు
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!







