దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- September 04, 2026
మస్కట్: ఒమన్‌లోని పోర్ట్ ఆఫ్ దుక్మ్‌కు ప్రపంచంలోని అతిపెద్ద రోల్-ఆన్/రోల్-ఆఫ్ (Ro-Ro) నౌకల్లో ఒకటి చేరుకుంది. చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ BYDకు చెందిన ఈ నౌక తొలిసారిగా ఒమన్‌కు చేరుకున్నది. చైనా నుంచి బయలుదేరిన ఈ నౌకలో మొత్తం 9,200 వాహనాలను తరలించే సామర్థ్యం ఉంది. దుక్మ్ పోర్టుకు చేరుకునే సమయంలో ఇందులో GCC మార్కెట్ల కోసం 1,219 వాహనాలు ఉన్నాయి. మొత్తం సరుకును దుక్మ్ పోర్టులోనే అన్‌లోడ్ చేయనున్నారు. వాటిలో 200కు పైగా వాహనాలు ఒమన్ మార్కెట్‌కు కేటాయించగా, మిగిలిన వాహనాలను కువైట్, ఖతార్ సహా పలు గల్ఫ్ దేశాలకు తరలించనున్నారు.
పెద్ద సామర్థ్యం కలిగిన Ro-Ro నౌకలను స్వీకరించేందుకు దుక్మ్ పోర్ట్ సిద్ధంగా ఉందని ఈ రాక నిరూపించిందని అధికారులు తెలిపారు. పోర్టుకు ఏడాదికి సుమారు 3 లక్షల వాహనాలను నిర్వహించే సామర్థ్యం ఉంది. పోర్టులో 2.2 కిలోమీటర్ల వాణిజ్య బెర్త్ ఉండగా, బెర్త్ వద్ద నీటి లోతు 18 మీటర్ల వరకు ఉంటుంది. దీంతో భారీ వాణిజ్య నౌకలను స్వీకరించడంతో పాటు వివిధ రకాల సరుకులను నిర్వహించేందుకు అవకాశం ఉంది. పోర్ట్ ఆఫ్ దుక్మ్ సీఈఓ రెగ్గీ వెర్మ్యూలెన్ మాట్లాడుతూ.. BYDకు చెందిన తొలి నౌక దుక్మ్ పోర్టుకు చేరుకోవడం వాహనాల నిర్వహణ కార్యకలాపాల అభివృద్ధిలో కీలక మైలురాయిగా పేర్కొన్నారు.
కీలక మార్గం
అరేబియా సముద్ర తీరంలో, హోర్ముజ్ జలసంధికి వెలుపల దుక్మ్ పోర్ట్ ఉండటం దాని వ్యూహాత్మక ప్రాధాన్యతను పెంచుతోంది. ఆసియా మార్కెట్లను ఒమన్‌తో పాటు GCC దేశాలతో అనుసంధానించడంలో పోర్ట్ కీలక పాత్ర పోషిస్తోందని అధికారులు తెలిపారు. భారత ఉపఖండం, ఆసియా, ఆఫ్రికా, GCC మార్కెట్లకు అంతర్జాతీయ వాణిజ్య మార్గాల ద్వారా వేగవంతమైన కనెక్టివిటీ అందించేందుకు దుక్మ్ పోర్ట్‌కు అవకాశం ఉందన్నారు.
దుక్మ్ పోర్ట్‌లో వాహనాలను అన్‌లోడ్ చేసి, వాటిని వివిధ గల్ఫ్ మార్కెట్లకు రోడ్డు మార్గం ద్వారా తరలించడం ప్రాంతీయ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని అధికారులు తెలిపారు. లాజిస్టిక్స్ కనెక్టివిటీని పెంచడం, జాతీయ ఆర్థిక వ్యవస్థను విభిన్నీకరించడం, ఒమన్‌ను ప్రాంతీయ వాణిజ్య-లాజిస్టిక్స్ హబ్‌గా అభివృద్ధి చేయడం వంటివి ఒమన్ విజన్ 2040 లక్ష్యాలకు అనుగుణంగా ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన







