బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- September 04, 2026
మనామా: బహ్రెయిన్‌లోని చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలకు ఈ ఏడాది తొలి ఎనిమిది నెలల్లో దాదాపు 3.94 లక్షల సందర్శనలు నమోదయ్యాయి. బహ్రెయిన్ ఫోర్ట్ ఒక్కటే మొత్తం సందర్శనల్లో దాదాపు మూడింట రెండొంతులు ఆకర్షించడం విశేషం. బహ్రెయిన్ అథారిటీ ఫర్ కల్చర్ అండ్ యాంటిక్విటీస్ గణాంకాల ప్రకారం.. జనవరి నుంచి ఆగస్టు 2026 వరకు మొత్తం 3,93,536 సందర్శనలు నమోదయ్యాయి. ఇందులో బహ్రెయిన్ ఫోర్ట్‌కు 2,46,409 సందర్శనలు వచ్చాయి. ఇది మొత్తం సందర్శనల్లో సుమారు 63 శాతంగా ఉంది. బహ్రెయిన్ ఫోర్ట్ తర్వాత ట్రీ ఆఫ్ లైఫ్, విజిటర్ సెంటర్‌కు 64,561 మంది, బహ్రెయిన్ నేషనల్ మ్యూజియంకు 37,020 మంది సందర్శకులు వచ్చారు.
విదేశీ సందర్శకులు అత్యధికంగా 1,87,567 మంది ఉండగా, బహ్రెయిన్ పౌరులు 99,099 మంది ఉన్నారు. టూరిస్ట్ ఏజెన్సీల ద్వారా 59,681 సందర్శనలు నమోదయ్యాయి. అరబ్ దేశాల నుంచి 17,324, GCC దేశాల నుంచి 15,877 సందర్శనలు వచ్చాయి. ఆర్గనైజ్డ్ గ్రూపుల ద్వారా 6,918, ప్రైవేట్ పాఠశాలల నుంచి 4,054, నర్సరీల నుంచి 1,123 సందర్శనలు నమోదయ్యాయి. విభాగాల వారీగా చూస్తే పురావస్తు ప్రదేశాలు 2,56,813 సందర్శనలతో మొదటి స్థానంలో ఉన్నాయి. మ్యూజియంలకు 42,153, పెర్లింగ్ పాత్ ప్రాంతాలకు 11,641, కోటలకు 2,839, హస్తకళల ప్రదేశాలకు 2,537 సందర్శనలు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన







