‘మండాడి’ షూటింగ్లో ప్రాణాపాయం..
- September 04, 2026
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్, తమిళ విలక్షణ నటుడు సూరి కాంబినేషన్లో తెరకెక్కిన భారీ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా ‘మండాడి’. ఈ చిత్రం సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదల సమయం దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్లలో వేగం పెంచింది. ప్రచారంలో భాగంగా హీరో సుహాస్, సముద్రం నేపథ్యంలో సాగే ఈ చిత్రం క్లైమాక్స్ షూటింగ్ సమయంలో తమ టీమ్ ఎదుర్కొన్న అత్యంత భయానక, ప్రమాదకర పరిస్థితుల గురించి సంచలన విషయాలను వెల్లడించాడు.
45 రోజుల పాటు సముద్రంలోనే షూటింగ్
‘మండాడి’ చిత్రం కోసం అత్యంత కీలకమైన క్లైమాక్స్ సన్నివేశాలను దాదాపు 45 రోజుల పాటు ఏకధాటిగా సముద్రంలోనే చిత్రీకరించినట్లు సుహాస్ తెలిపాడు. ఆ సముద్ర ప్రయాణంలో అడుగడుగునా ఘోరమైన ప్రమాదాలు ఎదురయ్యాయని వివరించాడు. మూడు, నాలుగు సార్లు సముద్రపు భారీ అలల ధాటికి తాము ప్రయాణిస్తున్న బోట్లు తిరగబడ్డాయని, ప్రాణాలు కోల్పోయేంతటి తీవ్రమైన రిస్క్ అనుభవించామని సుహాస్ చెప్పుకొచ్చాడు.
కెమెరామెన్లు నీటిలో పడిపోయారు: సుహాస్
షూటింగ్ సమయాల్లో ప్రతికూల పరిస్థితుల వల్ల టెక్నీషియన్లు, కెమెరామెన్లు సైతం నీటిలో పడిపోయారని సుహాస్ గుర్తుచేసుకున్నాడు. ఏమాత్రం నెట్వర్క్ సిగ్నల్స్ లేని ఆ వాతావరణంలో జీవితం విలువ ఏంటో తనకు స్పష్టంగా అర్థమైందని వ్యాఖ్యానించాడు. తన కెరీర్లోనే ఇది అత్యంత ప్రమాదకరమైన చిత్రమని, ప్రాణాల కంటే సినిమా ఏదీ ఎక్కువ కాదు కాబట్టి భవిష్యత్తులో మళ్లీ ఇంతటి తీవ్రమైన రిస్క్ ఉన్న చిత్రాలు చేయబోనని సుహాస్ తేల్చి చెప్పాడు.
తాజా వార్తలు
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!







