గేయం ఓ గురువర్య
- September 05, 2026
పల్లవి
ఓ గురువర్య ఓ గురువర్య ఓగురువర్య
నీకు వందనమయ్య వందనమయ్య నీకు
ఓగురువర్య ఓగురువర్య ఓగురువర్య
నీకు వందనమయ్య వందనమయ్య నీకు .
చరణం
అక్షరప్రాంగణంలో అమృతం పంచే బోధకుడు
అహంచూపని తరగతి గదిలో ఓ స్నేహితుడు
అలుపేలేని సాధనతో సాధ్యమనే అక్షరశిల్పతడు
అందరికి జ్ఞానాన్ని అందించే సృష్టికర్త అతడు.
నీకు వందనమయ్య నీకు వందనమమ్మ నీకు.
చరణం
తరగతి గదిలో మమకారము పెంచూతూ
నిరాకార రూపానికి ప్రాణము పోసేటివాడు
విషయావగాహనపై దృష్టి ని నిలిపినవాడు
ప్రతి విద్యార్థికి వెన్నముకై నిలిచిన వాడు.
నీకు వందనమయ్య నీకు వందనమమ్మ నీకు.
చరణం
సంస్కారం రంగరించిన భవిష్యత్తు మార్గగామి
దేవుని ప్రతిరూపమై విద్యాబుద్ధులు నేర్పినారు
మాణిక్యాలు ఎన్నో తయారు చేసిన మహాశక్తి
బదిలీ వృత్తికే, బోధనకి బదిలీ లేదనే గురువులు.
నీకు వందనమయ్య నీకు వందనమమ్మ నీకు.
--యామిని కోళ్ళూరు ✍️
తాజా వార్తలు
- దమ్మామ్ విమానాశ్రయంలో భారీ గా డ్రగ్స్ సీజ్..!!
- షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రమాదం.. కార్మికుడికి గాయాలు..!!
- ఇరాన్ వాదనలను ఖండించిన ఖతార్.. యూఎన్ఓకు లేఖలు..!!
- రోడ్డు ప్రమాదంలో స్టూడెంట్ మృతి.. విద్యాశాఖ దిగ్భ్రాంతి..!!
- ఒమన్‌లో గుండె మార్పిడి సక్సెస్.. ఒకే దాతతో నలుగురికి ప్రాణదానం..!!
- 2 కిలోమీటర్లకు 40 నిమిషాలు.. యూఏఈలో మళ్లీ భారీ ట్రాఫిక్..!!
- దోహాకు చేరిన భారత కొత్త రాయబారి డాక్టర్ శ్రీకర్ రెడ్డి..
- తమ కార్యకలాపాలను నిలిపివేయాలని టాటా కెమికల్స్‌ను ఆదేశించిన కెన్యా అధ్యక్షుడు
- ఖతార్‌లో భారత తదుపరి రాయబారిగా బాధ్యతలు చేపట్టనున్న డా.శ్రీకర్ రెడ్డి కొప్పుల
- Dh120,000 రుణం చెల్లించాలి..మరో Dh15,000 పరిహారం ఇవ్వాలన్న అబుదాబి కోర్టు







