షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రమాదం.. కార్మికుడికి గాయాలు..!!

- September 05, 2026 , by Maagulf
షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రమాదం.. కార్మికుడికి గాయాలు..!!

కువైట్ : షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో నిర్మాణంలో ఉన్న భవనంలో శుక్రవారం సాయంత్రం ప్రమాదం చోటుచేసుకుంది. ఎత్తు నుంచి కింద ఉన్న బేస్‌మెంట్ గుంతలో పడిపోవడంతో ఓ కార్మికుడు గాయపడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే వైఖ్ ఇండస్ట్రియల్ సెంటర్ అగ్నిమాపక సిబ్బంది, సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

రక్షణ సిబ్బంది గాయపడిన కార్మికుడిని సురక్షితంగా గుంత నుంచి బయటకు తీసుకువచ్చారు. అనంతరం అతడిని చికిత్స కోసం అత్యవసర వైద్య సేవల సిబ్బందికి అప్పగించారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నాట్లు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com