మస్కట్ విమానాశ్రయంలో ఒమానీ ప్రయాణికులే టాప్..!!

- September 06, 2026 , by Maagulf
మస్కట్ విమానాశ్రయంలో ఒమానీ ప్రయాణికులే టాప్..!!

మస్కట్: ఒమన్ విమానాశ్రయాల్లో ప్రయాణికుల రద్దీ ఈ ఏడాది తగ్గింది. 2026 జూలై చివరి నాటికి దేశంలోని విమానాశ్రయాల ద్వారా రాకపోకలు, ట్రాన్సిట్ కలిపి మొత్తం 7,689,967 మంది ప్రయాణించారు. గత ఏడాది ఇదే కాలంలో 8,366,273 మంది ప్రయాణించగా.. ఈసారి 8.1 శాతం తగ్గుదల నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) తాజా గణాంకాల ప్రకారం.. జూలైలో మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యధికంగా రాకపోకలు సాగించిన జాతీయతగా ఒమానీలు నిలిచారు.

భారతీయులు రెండో స్థానంలో

జూలైలో మస్కట్ విమానాశ్రయం ద్వారా మొత్తం 204,591 మంది ఒమానీ ప్రయాణికులు రాకపోకలు సాగించారు. వీరిలో 95,111 మంది ఒమన్‌కు చేరుకోగా.. 109,480 మంది దేశం నుంచి బయలుదేరారు. భారతీయులు 169,751 మంది ప్రయాణికులతో రెండో స్థానంలో నిలిచారు. వీరిలో 99,958 మంది రాగా.. 69,793 మంది బయలుదేరారు. బంగ్లాదేశ్ ప్రయాణికులు 46,665 మందితో మూడో స్థానంలో ఉన్నారు.

అంతర్జాతీయ విమానాల్లో 9.5% తగ్గుదల

మస్కట్, సలాలా, సోహార్ విమానాశ్రయాల మీదుగా 2026 జూలై చివరి వరకు మొత్తం 45,904 అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగించాయి. 2025లో ఇదే కాలంలో 50,747 విమానాలు నమోదుకాగా.. ఈసారి 9.5 శాతం తగ్గాయి. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అంతర్జాతీయ, దేశీయ విమానాలు కలిపి 49,315 విమానాలు నమోదయ్యాయి. గత ఏడాది 53,170 విమానాలతో పోలిస్తే 7.3 శాతం తగ్గాయి. ప్రయాణికుల సంఖ్య 6,855,942కు చేరింది. గత ఏడాది 7,453,204 మందితో పోలిస్తే 8 శాతం తగ్గింది.
అంతర్జాతీయ విమానాలు 8.4 శాతం తగ్గి 43,970కు చేరగా.. వాటిలో ప్రయాణించిన వారి సంఖ్య 9 శాతం తగ్గి 6,164,584కు చేరింది. అయితే దేశీయ విమానాల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. దేశీయ విమానాలు 3.1 శాతం పెరిగి 5,345కు చేరాయి. ప్రయాణికుల సంఖ్య కూడా 2 శాతం పెరిగి 691,358కు చేరింది.

అలాగే, సలాలా విమానాశ్రయంలో అంతర్జాతీయ, దేశీయ విమానాలు కలిపి 5,569** నమోదయ్యాయి. గత ఏడాది 5,881తో పోలిస్తే 5.3 శాతం తగ్గాయి. సోహార్ విమానాశ్రయంలో జూలై చివరి వరకు అంతర్జాతీయ, దేశీయ విమానాలు కలిపి 122 నమోదయ్యాయి. గత ఏడాది 130తో పోలిస్తే 6.2 శాతం తగ్గాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com