ఒమన్ లో స్కూల్ బస్సు డ్రైవర్లకు పోలీసుల కీలక సూచనలు..!!

- September 06, 2026 , by Maagulf
ఒమన్ లో స్కూల్ బస్సు డ్రైవర్లకు పోలీసుల కీలక సూచనలు..!!

మస్కట్: ఒమాన్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో పాఠశాల బస్సు డ్రైవర్లకు రాయల్ ఒమాన్ పోలీస్ (ROP) కీలక సూచనలు జారీ చేసింది. పాఠశాలకు చేరుకున్న తర్వాత, అలాగే పాఠశాల నుంచి బయలుదేరే సమయంలో బస్సులోని విద్యార్థులందరూ పూర్తిగా దిగిపోయారని తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని సూచించింది.

బస్సులో ఒక్క విద్యార్థి కూడా మిగిలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రతి ప్రయాణం పూర్తైన తర్వాత బస్సును పూర్తిగా తనిఖీ చేయడాన్ని డ్రైవర్లు తప్పనిసరి అలవాటుగా మార్చుకోవాలని కోరింది.
డ్రైవర్లకు ROP కీలక సూచనలు
* ఏ విద్యార్థినీ బస్సులో వదిలివెళ్లకూడదు.
* ప్రతి ట్రిప్ అనంతరం బస్సును తప్పనిసరిగా చెక్ చేయాలి.
* పాఠశాలకు చేరుకున్న తర్వాత విద్యార్థులందరూ దిగిపోయారని నిర్ధారించుకోవాలి.
* నిద్రపోతున్న లేదా అలసటతో ఉన్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
* బస్సులోని మార్గాలు, సీట్లను పరిశీలించాలి.
* వెనుక వరుస సీట్లను అత్యంత జాగ్రత్తగా తనిఖీ చేయాలి.
“బస్సును తనిఖీ చేయడానికి తీసుకునే కొద్ది నిమిషాలు కొందరి ప్రాణాలను కాపాడగలవు” అని రాయల్ ఒమాన్ పోలీసులు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, ఒమాన్‌లోని వివిధ గవర్నరేట్‌ల విద్యా డైరెక్టరేట్ల పరిధిలో ఉన్న పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి మొత్తం 876,117 మంది విద్యార్థులు ఉండగా.. వీరిలో 440,899 మంది బాలురు, 435,218 మంది బాలికలు ఉన్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ పాఠశాల రవాణా వ్యవస్థలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com