దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- September 06, 2026
దుబాయ్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను దుబాయ్‌లో ఘనంగా నిర్వహించేందుకు గల్ఫ్ తెలంగాణ ఫోరం (GTF), ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ (ETCA) ఏర్పాట్లు చేస్తున్నాయి. అక్టోబర్ 11న దుబాయ్‌లో నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రవాస తెలంగాణ ప్రజలతో కలిసి సంబరాల్లో పాల్గొనాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను నిర్వాహకులు ఆహ్వానించారు.
GTF ఫౌండర్, అధ్యక్షుడు ఆకుల సురేందర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కేటీఆర్‌ను కలిసి వేడుకలకు సంబంధించిన ఆహ్వానపత్రాన్ని అందజేసింది. తెలంగాణ ఆడపడుచులు, ప్రవాస తెలంగాణ కుటుంబాలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొనాలని కేటీఆర్‌ను వారు ప్రత్యేకంగా కోరారు.
రెండు ప్రాంతాల్లో బతుకమ్మ సంబరాలు
తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని గల్ఫ్ దేశాల్లోనూ కొనసాగించడంతో పాటు, ప్రవాస తెలంగాణ సమాజంలో తమ సంస్కృతి, సంప్రదాయాల పట్ల అనుబంధాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు GTF ప్రతినిధులు తెలిపారు.
అక్టోబర్ 11న దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. అనంతరం ETCA ఆధ్వర్యంలో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మరో బతుకమ్మ వేడుక జరగనుంది. ఈ రెండు కార్యక్రమాల్లోనూ కేటీఆర్ పాల్గొంటారని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల తెలిపారు.
ఈ సందర్భంగా దుబాయ్‌లో నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలకు సంబంధించిన ప్రత్యేక ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించారు.
భావితరాలకు తెలంగాణ సంస్కృతి పరిచయం
బతుకమ్మ పండుగ తెలంగాణలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారని మహేష్ బిగాల తెలిపారు. గల్ఫ్ దేశాల్లోనూ ఈ పండుగకు విశేష ఆదరణ లభిస్తోందన్నారు. ప్రవాస తెలంగాణ ప్రజలు తమ స్వస్థలాలతో ఉన్న సాంస్కృతిక అనుబంధాన్ని కొనసాగించేందుకు బతుకమ్మ వేడుకలు ఒక వేదికగా నిలుస్తున్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు.
మహిళలు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని బతుకమ్మలను పేర్చి, బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకలు నిర్వహించనున్నారు. తెలంగాణ సంస్కృతి, జానపద కళలు, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేసేలా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
కేటీఆర్ హాజరు ప్రత్యేక ఆకర్షణ
కేటీఆర్ దుబాయ్ బతుకమ్మ వేడుకలకు హాజరై ప్రవాస తెలంగాణ ప్రజలతో కలిసి పండుగలో పాల్గొంటే తమకు మరింత ఉత్సాహం, ప్రోత్సాహం లభిస్తుందని GTF ప్రతినిధులు తెలిపారు. గల్ఫ్‌లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలతో కేటీఆర్‌కు ఉన్న అనుబంధం నేపథ్యంలో ఆయన పాల్గొనడం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు.
కేటీఆర్‌ను కలిసిన ప్రతినిధి బృందంలో GTF ఫౌండర్, అధ్యక్షుడు ఆకుల సురేందర్‌తో పాటు జయంత్ కుమార్, అభినవ్, ఆకుల కళ్యాణ్, లత తదితరులు పాల్గొన్నారు.
KTR invited to Dubai Bathukamma celebrations
తాజా వార్తలు
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!







