OUN యాప్‌లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- September 07, 2026
దోహా: ఖతార్ మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ తన OUN మొబైల్ అప్లికేషన్లో 38 కొత్త డిజిటల్ సేవలను ప్రారంభించింది. దిగుమతి అనుమతులు, వెటర్నరీ క్వారంటైన్, హెల్త్ రికార్డులు, కంపెనీ రిజిస్ట్రేషన్, వ్యవసాయ సేవలకు సంబంధించిన ఈ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మంత్రిత్వ శాఖ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ విభాగం ద్వారా ఈ సేవలను ప్రారంభించారు. పబ్లిక్ సేవల డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ చర్య చేపట్టినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. సేవలను మరింత అభివృద్ధి చేయడం, ప్రక్రియలను సులభతరం చేయడం, వాటిని ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని పేర్కొంది.
జంతు ఉత్పత్తుల దిగుమతికి కొత్త సేవలు
కొత్తగా అందుబాటులోకి వచ్చిన దిగుమతి సేవల్లో యానిమల్ ప్రొడక్ట్స్, డెకరేషన్ ఫిష్, సముద్ర జంతువులు, అడవి పక్షులు, జంతువులు, టేబుల్ గుడ్లు, గుడ్డు ఉత్పత్తులు, పశువుల మేత, ఫీడ్ అడిటివ్స్, సప్లిమెంట్లు తదితరాలకు దిగుమతి అనుమతులు ఉన్నాయి. అలాగే పిల్లులు, కుక్కలు, గుర్రాలు, లైవ్ యానిమల్స్, రేసింగ్ ఒంటెల దిగుమతికి కూడా అనుమతి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
వెటర్నిటీ ఆరోగ్య ధ్రువపత్రాలు
జంతు ఉత్పత్తులు, ఉప ఉత్పత్తులు, సజీవ జంతువులు, పిల్లులు, కుక్కలు, ఒంటెలు, పక్షులు, కుందేళ్లు, అడవి జంతువులు, అడవి పక్షులు, ఫాల్కన్లు, గుర్రాలు, రేసింగ్ ఒంటెలు, పశువుల మేత తదితరాల ఎగుమతికి పశువైద్య ఆరోగ్య ధ్రువపత్రాలను కూడా యాప్ ద్వారా పొందే అవకాశం కల్పించారు. పిల్లులు, కుక్కల రీ-ఎంట్రీ అనుమతులు, పెంపకం మరియు వధ కోసం ఒంటెల దిగుమతి, పశువైద్య బయోలాజికల్ ఉత్పత్తులు, నియంత్రిత పశువైద్య మందులు, పరిమిత పదార్థాలు, ప్రయోగశాల సామగ్రి, పరికరాలు, పశువైద్య సౌందర్య, ఆరోగ్య ఉత్పత్తులు, ఫాల్కన్లు, పశువైద్య మందుల దిగుమతికి కూడా కొత్త సేవలు అందుబాటులో ఉన్నాయి.
OUN యాప్‌లో ఎలా పొందాలి?
ఈ కొత్త సేవలను పొందేందుకు వినియోగదారులు OUN యాప్‌ను డౌన్లోడ్ చేసి, తమ QID నంబర్, మొబైల్ నంబర్‌తో లాగిన్ కావాలి. నమోదిత మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ద్వారా లాగిన్ వివరాలను ధృవీకరిస్తారు. ఆ తర్వాత అవసరమైన సేవను ఎంచుకుని, కావాల్సిన వివరాలను నమోదు చేయాలి. అవసరమైతే సంబంధిత పత్రాలను అప్లోడ్ చేయవచ్చు. దరఖాస్తులను పూర్తిగా ఎలక్ట్రానిక్ విధానంలో సమర్పించడంతో పాటు, వాటి స్థితిని కూడా OUN యాప్ ద్వారానే ట్రాక్ చేసుకోవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్‌లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్‌లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్‌లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







