దుబాయ్‌లో టండూర్ టీనా రెస్టారెంట్‌ శాశ్వతంగా మూసివేత..!!

- September 07, 2026 , by Maagulf
దుబాయ్‌లో టండూర్ టీనా రెస్టారెంట్‌ శాశ్వతంగా మూసివేత..!!

దుబాయ్: దుబాయ్‌లో ప్రముఖ భారతీయ రెస్టారెంట్ టండూర్ టీనా (Tandoor Tina) శాశ్వతంగా మూసివేయనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 8న రెస్టారెంట్ చివరిసారిగా అతిథులకు సేవలు అందించనుంది. “స్పైస్, స్మోక్ అండ్ గుడ్ టైమ్స్”తో ఐదేళ్ల పాటు అతిథులకు సేవలందించిన అనంతరం తమ ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు రెస్టారెంట్ ప్రకటించింది. అయితే, శాశ్వత మూసివేతకు గల కారణాన్ని యాజమాన్యం వెల్లడించలేదు.
టండూర్ టీనా 2022 జనవరిలో ప్రారంభమైంది. భారతీయ రుచులు, ప్రత్యేకమైన వాతావరణంతో దుబాయ్ ఆహార ప్రియుల్లో గుర్తింపు సంపాదించుకుంది. 

గత ఐదేళ్లలో తమ రెస్టారెంట్‌కు వచ్చిన అతిథులతో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఏర్పడ్డాయని టండూర్ టీనా పేర్కొంది. వీడ్కోలు సందర్భంగా సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు చేసింది. “టీనాకు చెందిన ప్రయాణం ఇక్కడితో ముగుస్తోంది. అయితే చివరి చిట్ అండ్ చాట్‌కు ముందు కాదు. టేబుల్ వద్ద కలుద్దాం” అంటూ రెస్టారెంట్ తన సందేశంలో పేర్కొంది. సెప్టెంబర్ 8న టండూర్ టీనా చివరిసారిగా అతిథులను ఆహ్వానించనుండటంతో, ఈ రెస్టారెంట్‌ను అభిమానించే వారికి తమ ఇష్టమైన వంటకాలను మరోసారి ఆస్వాదించే అవకాశం లభించనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com