గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- September 07, 2026
అజ్మాన్: యూఏఈలోని ప్రముఖ వైద్య, ఆరోగ్య శాస్త్రాల విద్యా సంస్థ గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీ (GMU)లో 2026–2027 విద్యా సంవత్సరం ఆగస్టు 31న అధికారికంగా ప్రారంభమైంది. కొత్త విద్యా సంవత్సరానికి విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో క్యాంపస్‌కు చేరుకోవడంతో సందడి నెలకొంది.
వైద్య, ఆరోగ్య వృత్తి విద్యలో నాణ్యత, పరిశోధన, ఆవిష్కరణలకు మరింత ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగనున్నట్లు యూనివర్సిటీ చాన్సలర్ ప్రొఫెసర్ మందా వెంకటరమణ తెలిపారు. స్థానికంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన వైద్య, ఆరోగ్య నిపుణులను తయారు చేయడమే తమ లక్ష్యమన్నారు.
ఇటీవల GMUకి లభించిన అంతర్జాతీయ గుర్తింపులు తమ విద్యా ప్రమాణాలకు నిదర్శనమని, అదే సమయంలో భవిష్యత్తులో మరింత ఉన్నత ప్రమాణాలను సాధించేందుకు బాధ్యతను పెంచుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
విద్య, వైద్యం, పరిశోధనలకు సమగ్ర ప్రాధాన్యం
1998లో తుంబే గ్రూప్ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు డాక్టర్ తుంబే మొయిదీన్ స్థాపించిన GMU ప్రస్తుతం విద్య, వైద్యం, పరిశోధనలను అనుసంధానించిన సమగ్ర అకాడమిక్ హెల్త్ సిస్టమ్‌గా అభివృద్ధి చెందింది.
కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా యూనివర్సిటీ నాయకత్వం, వివిధ కాలేజీల డీన్లు, విభాగాధిపతులు సమావేశమై రానున్న ఏడాది విద్యా ప్రాధాన్యతలు, ప్రణాళికలపై చర్చించారు. డాక్టర్ తుంబే మొయిదీన్ కూడా కాలేజీల డీన్లతో సమావేశమై విద్యా సంవత్సరానికి సంబంధించిన అంశాలను సమీక్షించారు.
2026–27లో ఆధునిక హెల్త్‌కేర్ సైన్స్, ప్రాథమిక వైద్య విద్యతో పాటు డిజిటల్ హెల్త్, ఇంటర్‌డిసిప్లినరీ లెర్నింగ్, పరిశోధన, ఆవిష్కరణలకు మరింత ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
అంతర్జాతీయ గుర్తింపులతో మరింత ఉత్సాహం
కొత్త విద్యా సంవత్సరం GMUకు పలు అంతర్జాతీయ విజయాల నేపథ్యంలో ప్రారంభమైంది. 2026 జూన్‌లో యూకేకు చెందిన క్వాలిటీ అస్యూరెన్స్ ఏజెన్సీ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (QAA) నుంచి GMU సంస్థాగత అక్రెడిటేషన్ పొందింది. సమగ్ర అంతర్జాతీయ నాణ్యతా సమీక్ష అనంతరం లభించిన ఈ గుర్తింపు 2031 వరకు చెల్లుబాటు కానుంది.
యూరోపియన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏరియాలో నాణ్యతా ప్రమాణాలకు సంబంధించిన మొత్తం 10 యూరోపియన్ స్టాండర్డ్స్ అండ్ గైడ్‌లైన్స్‌ను GMU ఎలాంటి షరతులు లేకుండా పూర్తి చేసినట్లు యూనివర్సిటీ వెల్లడించింది.
అలాగే Times Higher Education Sustainability Impact Rankings 2026లో GMU ప్రపంచవ్యాప్తంగా 301–400 బ్యాండ్‌లో తన స్థానాన్ని కొనసాగించింది. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా ‘Reduced Inequalities’లో ప్రపంచవ్యాప్తంగా 23వ స్థానం, ‘Quality Education’లో 60వ స్థానం, ‘Good Health and Well-being’లో 64వ స్థానాన్ని సాధించింది.
7 కాలేజీలు.. 45 అక్రెడిటెడ్ ప్రోగ్రామ్‌లు
ప్రస్తుతం GMUలో మెడిసిన్, డెంటిస్ట్రీ, హెల్త్ సైన్సెస్, ఫార్మసీ, నర్సింగ్, హెల్త్‌కేర్ మేనేజ్మెంట్ అండ్ ఎకనామిక్స్, థంబే కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ AI ఇన్ హెల్త్‌కేర్ సహా ఏడు కాలేజీలు ఉన్నాయి.
యూనివర్సిటీలో 45 అక్రెడిటెడ్ ప్రోగ్రామ్‌లు, ఇప్పటి వరకు 5,000 మందికి పైగా గ్రాడ్యుయేట్లు ఉన్నారు. క్యాంపస్‌లో 111కి పైగా దేశాల విద్యార్థులు, 56 దేశాలకు చెందిన అధ్యాపకులు ఉన్నారు.
క్లినికల్ శిక్షణలో భాగంగా తుంబే గ్రూప్‌కు చెందిన ఏడు అకాడమిక్ ఆసుపత్రుల నెట్‌వర్క్‌లో 3,100కు పైగా ట్రైనింగ్ బెడ్లు అందుబాటులో ఉన్నాయి. అంతర్జాతీయంగా 75కు పైగా యూనివర్సిటీలతో GMU భాగస్వామ్యాలను కలిగి ఉంది.
యూఏఈలోని యూనివర్సిటీలలో Good Health and Well-Being విభాగంలో 2025 Times Higher Education Impact Rankingsలో GMU మొదటి స్థానాన్ని సాధించింది.
గల్ఫ్ మెడికల్ కాలేజీగా ప్రారంభమైన సంస్థ ప్రస్తుతం సమగ్ర విశ్వవిద్యాలయంగా, విద్య–వైద్యం–పరిశోధనలను అనుసంధానించే అకాడమిక్ హెల్త్ సిస్టమ్‌గా రూపాంతరం చెందింది. కొత్త విద్యా సంవత్సరంలోనూ నాణ్యమైన విద్య, పరిశోధన, క్లినికల్ శిక్షణ, ఆవిష్కరణలు, సామాజిక సేవపై మరింత దృష్టి సారించనున్నట్లు GMU తెలిపింది.
తాజా వార్తలు
- ఏపీ సీఎస్ సాయిప్రసాద్ పదవీకాలం పొడిగింపు
- దుబాయ్‌లో ఆన్లైన్ పెట్టుబడుల మోసం.. 30 ఏళ్ల పొదుపు Dh400,000 పైగా స్వాహా!
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రీషెడ్యూల్..
- సౌదీ విమానాశ్రయం, చమురు క్షేత్రంపై హూతీ దాడులు..
- కర్ణాటకలో విషాదం: బురదలో దిగబడిన కారు.. ఊపిరాడక ముగ్గురు మృతి
- యాస్ ఐలాండ్‌లో మరోసారి IIFA సందడి.. 2027 జనవరి 22, 23 తేదీల్లో వేడుకలు!
- కువైట్‌లో కంపెనీలకు షాక్.. 10వేల కంపెనీల ఫైళ్లు నిలిపివేత..!!
- సౌదీ అరేబియాలో భారీగా పెరిగిన నిర్మాణ వ్యయాలు..!!
- ఖతార్ లో అత్యవసర ప్రతిస్పందన బలోపేతం..!!
- మార్చి 24న మస్కట్ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన 2027..!!







