ఘనంగా చంద్రబోస్ కుమారుడి పెళ్లి..

- September 07, 2026 , by Maagulf
ఘనంగా చంద్రబోస్ కుమారుడి పెళ్లి..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గేయ రచయితగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న చంద్రబోస్ ఇంట ఘనంగా పెళ్లి వేడుకలు జరిగాయి. ఆయన కుమారుడు నందు వనమాలి పెళ్లి హనుమకొండలో సినీ సెలబ్రిటీలు, అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది..ఈ కార్యక్రమానికి చిరంజీవిని మొదలుకొని డైరెక్టర్ సుకుమార్ దంపతులతో పాటు ఎంతోమంది సెలబ్రిటీలు ఈ వేడుకల్లో సందడి చేశారు.

ఘనంగా చంద్రబోస్ కుమారుడి పెళ్లి.. ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ , కొరియోగ్రాఫర్ సుచిత్ర దంపతుల కుమారుడు నంద వనమాలి అలియాస్ నందు.. ఉషాకోయిల చంద్రకళ - ప్రకాష్ దంపతుల ఏకైక కుమార్తె శృతి తో సెప్టెంబర్ 4 ఉదయం 10:28 గంటల సుముహూర్తంలో హనుమకొండలోని శ్యామ్ పేటలో ఉన్న డి -కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ వివాహం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చంద్రబోస్ కుమారుడు నందు, శృతి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నెటిజన్స్.

రిసెప్షన్ కి హాజరైన సెలబ్రిటీస్..సెప్టెంబర్ 6 రాత్రి 7:00 గంటల సమయంలో హైదరాబాద్, హైటెక్ సిటీ , శిల్పారామంలో నందు-శృతిల రిసెప్షన్ ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి టాలీవుడ్ దిగ్గజాలైన మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, డైరెక్టర్ సుకుమార్ దంపతులు, డైరెక్టర్ సందీప్ రెడ్డి,ఎం.ఎం కీరవాణి, బ్రహ్మానందం వంటి తారలు ఈ వేడుకల్లో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నంద వనమాలి-శృతి జంట చూడ చక్కగా ఉంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com