మెరుపు వీరుడు ఉసేన్ బోల్టు ఒలింపిక్స్‌లో అరుదైన ఘనత..
- August 19, 2016
మెరుపు వీరుడు ఉసేన్ బోల్టు ఒలింపిక్స్‌లో అరుదైన ఘనత సాధించాడు. మూడు ఈవెంట్లలో బంగారు పతకం సాధించాడు. పురుషుల 400 మీటర్ల రిలేలో అసఫా పావెల్, బ్లేక్, అస్మెది, బోల్ట్‌తో కూడిన బృందం విజయం సాధించింది. దీంతో బోల్ట్ 100 మీ, 200మీ, 400 మీ. రిలేలో వరుసుగా మూడుసార్లు స్వర్ణం సాధించినట్లైంది. పురుషుల 400 మీటర్ల రిలేను వరుసగా మూడు సార్లు సాధించిన రెండో అథ్లెట్‌గా బోల్ట్ రికార్డు సృష్టించాడు. గతంలో 1928, 1932, 1936లో అమెరికాకు చెందిన ఫ్రాంక్ వైకాఫ్ మాత్రమే ఈ ఘనతను సాధించాడు. జమైకా బృందం 37.27 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని స్వర్ణాన్ని సాధించిందిజపాన్ బృందం 37.60 సెకన్లతో ద్వితీయ స్థానంలో నిలిచింది. కెనడా 37.64 సెకన్లతో తృతీయ స్థానంలో సాధించింది.అమెరికాపై అనర్హత వేటు గాట్లిన్ నేతృత్వంలోని అమెరికా బృందం అనర్హత కారణంగా పతకానికి దూరమైంది. ఎక్సే్చంజి జోన్ నిబంధన (170.7)అతిక్రమణ కారణంగా న్యాయ నిర్ణేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎక్చ్సేంజి బాక్స్‌లోకి రాక ముందే గాట్లిన్ బాటిన్‌ను అందుకున్నట్లు ఫుటేజీలో స్పష్టంగా కనిపించడంతో జడ్జిలు అనర్హత వేటు వేశారు. దీంతో కెనడాకు కాంస్యం దక్కింది.అథ్లెటిక్స్‌లో కొత్త చరిత్ర ఇక ట్రిపుల్ ట్రిపుల్ సాధించిన తొలి అథ్లెట్‌గా బోల్ట్ చరిత్ర సృష్టించాడు. వరుసగా మూడు ఒలింపిక్స్‌లో 100మీ, 200మీ, 400 మీ రిలేలో స్వర్ణం సాధించిన అరుదైన ఘనతను అందుకున్నాడు. 29ఏళ్ల బోల్టుకు ఇదే చివరి ఒలింపిక్స్ కావచ్చని భావిస్తున్నారు. దీంతోపాటు తొమ్మిది స్వర్ణాలు సాధించిన అథ్లెట్లు కార్ల్ లూయిస్(యూఎస్‌ఏ), పావో నుర్మీ( ఫిన్లాండ్) సరసన చేరాడు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







