డాలస్ లో మహత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా 157వ గాంధీ జయంతి వేడుకలు
- October 06, 2026
డాలస్, టెక్సస్: మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక కార్యదర్శి రావు కల్వాల మాట్లాడుతూ గత 12 సంవత్సరాలగా గాంధీ జయంతి సందర్భంగా ఈ పార్క్ లో శాంతి నడక యాత్ర నిర్వహిస్తున్నామని, ఈ రోజు వర్షం కారణంగా వాతావరణం అనుకూలంగా లేకపోయినా వందలాది ప్రవాసభారతీయులు హాజరు కావడం సంతోషం అని అందరికీ ఆహ్వానం పలికారు.
మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “గాంధీ సిద్ధాంతాలు అన్ని కాలమానాలలోను, ప్రత్యేకంగా ప్రపంచం అంతా యుద్ధ వాతావరణం నెలకొనియున్న ఈ సమయంలో కూడా ఆచరణ యోగ్యమే అన్నారు. శాంతియుతమైన ప్రతిఘటన ద్వారా ఎంతటి శక్తిమంతమైన సామ్రాజ్యాన్నైనా ఎదిరించవచ్చని ప్రపంచానికి నిరూపించడం మహాత్మాగాంధీ సాధించిన మహోన్నత విజయం. అమెరికాలో పౌరహక్కుల ఉద్యమానికి నాయకత్వం వహించిన డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడిన నెల్సన్ మండేలా లాంటి ప్రపంచంలోని ఎందరో మహానాయకులు గాంధీజీ సిద్ధాంతాల నుంచి ప్రేరణ పొందారు. గాంధీజీ తాత్విక చింతనకు ఉన్న విశ్వవ్యాప్త ప్రాధాన్యాన్ని గుర్తించిన ఐక్యరాజ్యసమితి, గాంధీజీ జన్మదినమైన అక్టోబర్ 2వ తేదీని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించింది” అన్నారు.
ముఖ్యఅతిథిగా హాజరైన ఇర్వింగ్ డిప్యూటీ మేయర్ మార్క్ క్రోనన్వెట్ మాట్లాడుతూ ఈ ప్రాంతం అభివృద్ధిలో ప్రవాస భారతీయుల కృషి అభినందనీయం, అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ మెమోరియల్ ఇక్కడ నెలకొని ఉండడం నగరానికే గర్వకారణం అని గాంధీజీ కి నివాళులర్పించారు.
ప్రత్యేకఅతిథిగా హాజరైన కాపెల్ సిటీ కౌన్సిల్ మెంబర్ రమేశ్ ప్రేమకుమార్ మాట్లాడుతూ బ్రిటన్ నుండి భారతదేశానికి విముక్తి కల్గించడంలో గాంధీజీ చేసిన కృషిని కొనియాడి పుష్పాంజలి ఘటించారు.
ప్రముఖ గాంధేయవాది, మహాత్మాగాంధీ మెమోరియల్ గవర్నెన్స్ బోర్డ్ సభ్యులు డా. సూదనగుంట రాఘవేంద్ర ప్రసాద్ రచించిన “ద పెరల్స్ ఆఫ్ గాంధీజీస్ విజ్డం” అనే గ్రంధాన్ని డిప్యూటీ మేయర్ మార్క్ క్రోనన్వెట్ ఆవిష్కరించారు.
ఇండియా అసోసియషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఉపాధ్యక్షులు దీపక్ కాల్రా, బోర్డు సభ్యులు రావు కల్వాల, తయాబ్ కుండావాల, రాంకీ చేబ్రోలు, శైలేష్ షా, స్వాతీ షా, ముర్తుజ, కలై కృష్ణ, వినోద్ ఉప్పు, శాంటే చారి, డా. సూదనగుంట రాఘవేంద్ర ప్రసాద్ ఇర్వింగ్ డిప్యూటీ మేయర్ మార్క్ క్రోనన్వెట్, కాపెల్ సిటీ కౌన్సిల్ మెంబర్ రమేశ్ ప్రేమకుమార్ లను సత్కరించి, శాంతికి చిహ్నంగా పది శ్వేత కపోతాలను ఎగురవేశారు.కార్యక్రమానంతరం ‘ఇండియా టుడే’ సౌత్ లేక్ రెస్టారెంట్ వారు అందించిన ఉపాహారంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
ఈ కార్యక్రమం విజయవంతం గావడానికి సహకరించిన కార్యకర్తలకు, బోర్డ్ సభ్యులకు, అధికారులకు, రుచికరమైన అల్పాహారం అదించిన ఇండియా టుడే యాజమాన్యానికి డా. ప్రసాద్ తోటకూర ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.


తాజా వార్తలు
- బైక్‌లు, క్యాంప్‌సైట్ అద్దె పేరుతో ఆన్లైన్ మోసాలు..
- దుబాయ్‌లో ఘనంగా తెలుగు చార్టర్డ్ అకౌంటెంట్ల వనభోజనాలు.. 350 మందికి పైగా హాజరు
- బహ్రెయిన్‌పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్
- యెమెన్‌లో వారం రోజుల్లో 1,269 పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసిన సౌదీ మసామ్ ప్రాజెక్టు
- లిబియాలో రష్యా నౌకపై డ్రోన్ దాడి అనుమానం.. బెంఘాజీ నౌకాశ్రయంలో భారీ పేలుడు
- రష్యా పౌరుడిని ఎయిర్ లిఫ్ట్ చేసిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- సౌదీలో అక్రమ నివాసులపై భారీ చర్యలు..!!
- ఖతార్‌లో ఇక పేపర్ సిక్‌లీవ్ సర్టిఫికెట్లకు సెలవు..!
- కువైట్‌లో 10 మంది అరెస్ట్, 6 వాహనాలు స్వాధీనం..!!
- ఇరాన్ దాడులపై UN కు బహ్రెయిన్ ఫిర్యాదు..!!







