సౌదీ అరేబియాలో మరింత వేగంగా భద్రతాపరమన ఫిర్యాదులు..!!
- October 06, 2026
రియాద్: సౌదీ అరేబియా పబ్లిక్ సెక్యూరిటీ జనరల్ డైరెక్టరేట్ ‘Kollona Amn’ యాప్‌ను అప్‌గ్రేడ్ చేసింది. డిజిటల్ భద్రతా సేవలను మరింత మెరుగుపరచడంతో పాటు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వేగంగా, సమర్థవంతంగా పరిష్కరించే లక్ష్యంతో కొత్త వెర్షన్‌ను ప్రారంభించింది. కొత్త వెర్షన్‌లో పలు టెక్నికల్, ఆపరేషనల్ అప్‌గ్రేడ్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. యాప్ వినియోగదారులకు మరింత సులభమైన అనుభవాన్ని అందించేలా మార్పులు చేశారు.
సంబంధిత అధికారులకు నేరుగా ఫిర్యాదులు
ప్రజలు యాప్ ద్వారా పంపించే భద్రతకు సంబంధించిన ఫిర్యాదులు, సమాచారాన్ని సంబంధిత భద్రతా విభాగాలకు మరింత విశ్వసనీయంగా చేరేలా కొత్త వ్యవస్థను రూపొందించారు. దీంతో ఫిర్యాదులపై త్వరిత స్పందన, సమాచారాన్ని ఖచ్చితంగా ప్రాసెస్ చేయడం సాధ్యమవుతుందని పబ్లిక్ సెక్యూరిటీ డైరెక్టరేట్ తెలిపింది.
సౌదీ పౌరులు, దేశంలో నివసిస్తున్న ప్రవాసులు భద్రతకు సంబంధించిన ఫిర్యాదులు లేదా సమాచారాన్ని తెలియజేయడానికి ‘Kollona Amn’ యాప్‌ను ఉపయోగించాలని అధికారులు కోరారు. సమాజ భద్రతను మరింత బలోపేతం చేయడంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పబ్లిక్ సెక్యూరిటీ డైరెక్టరేట్ పేర్కొంది.
తాజా వార్తలు
- గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2026కు యూఏఈలో శ్రీకారం
- సౌదీ అరేబియాకు బహ్రెయిన్ మద్దతు..!!
- ఒమన్‌లో 10 ఏళ్ల బాలుడు గల్లంతు..కొనసాగుతున్న గాలింపు..!!
- ఖతార్‌లో వరల్డ్ స్పేస్ వీక్ 2026 ప్రారంభం..!!
- కువైట్‌లో 194 మంది ప్రవాసుల డిపోర్ట్..!!
- యూఏఈలో Etisalat కస్టమర్లకు ఉచిత డేటా ఆఫర్..!!
- సౌదీ అరేబియాలో మరింత వేగంగా భద్రతాపరమన ఫిర్యాదులు..!!
- నజ్రాన్, జిజాన్ విమానాశ్రయాల పై దాడులు.. ముగ్గురికి గాయాలు
- ఏపీలో నాలుగు కొత్త కమిషనరేట్లకు ఆమోదం
- స్కూల్ ప్రాంగణంలో పిల్లల ఫొటోలు తీస్తే భారీ జరిమానా.. తల్లిదండ్రులకు హెచ్చరిక







