సౌదీ అరేబియాకు బహ్రెయిన్ మద్దతు..!!
- October 06, 2026
మనామా: యెమెన్‌లో చట్టబద్ధమైన ప్రభుత్వాన్ని పునరుద్ధరించేందుకు సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమి చేస్తున్న ప్రయత్నాలకు బహ్రెయిన్ పూర్తి మద్దతు ప్రకటించింది. యెమెన్‌లో తిరుగుబాటును ముగించి, ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటూ సమగ్ర రాజకీయ పరిష్కారం సాధించేందుకు సౌదీ అరేబియా చేస్తున్న కృషికి తమ మద్దతు కొనసాగుతుందని బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
సౌదీ అరేబియాపై హౌతీ మిలీషియా కొనసాగిస్తున్న దాడులను బహ్రెయిన్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. పౌరులు, పౌర మౌలిక సదుపాయాలు, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలక వసతులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని పేర్కొంది.
అలాగే మక్కా, మదీనా పవిత్ర నగరాలతో పాటు రియాద్, అబ్హా, ఖమీస్ ముషైత్, జజాన్, నజ్రాన్, తాయిఫ్, యన్బు నగరాలపై కూడా దాడులు జరిగినట్లు బహ్రెయిన్ పేర్కొంది. దక్షిణ ఎర్ర సముద్రం, బాబ్ అల్-మందబ్ జలసంధిలో సౌదీ నౌకలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.
సౌదీ భద్రతకు పూర్తి మద్దతు
సౌదీ అరేబియా తన భద్రత, సార్వభౌమత్వం, పౌరులు మరియు నివాసితుల రక్షణ కోసం తీసుకునే చర్యలకు బహ్రెయిన్ పూర్తి సంఘీభావం ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి చార్టర్‌లోని ఆర్టికల్ 51 ప్రకారం ఆత్మరక్షణకు సౌదీకి ఉన్న హక్కును బహ్రెయిన్ ప్రస్తావించింది.
సౌదీ అరేబియా భద్రత బహ్రెయిన్, గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాల భద్రతలో అంతర్భాగమేనని బహ్రెయిన్ విదేశాంగ శాఖ పేర్కొంది. ఉమ్మడి రక్షణ ఒప్పందానికి అనుగుణంగా ఈ పరస్పర భద్రతా మద్దతు కొనసాగుతుందని తెలిపింది.
యూఎన్ భద్రతా మండలికి బహ్రెయిన్ విజ్ఞప్తి
హౌతీ దాడులను అడ్డుకోవడంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, ముఖ్యంగా శాశ్వత సభ్య దేశాలు తమ బాధ్యతలను నిర్వర్తించాలని బహ్రెయిన్ కోరింది. ఈ దాడుల కారణంగా సముద్ర భద్రత, ఇంధన సరఫరాలకు ఎదురవుతున్న ముప్పును నివారించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2026కు యూఏఈలో శ్రీకారం
- సౌదీ అరేబియాకు బహ్రెయిన్ మద్దతు..!!
- ఒమన్‌లో 10 ఏళ్ల బాలుడు గల్లంతు..కొనసాగుతున్న గాలింపు..!!
- ఖతార్‌లో వరల్డ్ స్పేస్ వీక్ 2026 ప్రారంభం..!!
- కువైట్‌లో 194 మంది ప్రవాసుల డిపోర్ట్..!!
- యూఏఈలో Etisalat కస్టమర్లకు ఉచిత డేటా ఆఫర్..!!
- సౌదీ అరేబియాలో మరింత వేగంగా భద్రతాపరమన ఫిర్యాదులు..!!
- నజ్రాన్, జిజాన్ విమానాశ్రయాల పై దాడులు.. ముగ్గురికి గాయాలు
- ఏపీలో నాలుగు కొత్త కమిషనరేట్లకు ఆమోదం
- స్కూల్ ప్రాంగణంలో పిల్లల ఫొటోలు తీస్తే భారీ జరిమానా.. తల్లిదండ్రులకు హెచ్చరిక







