ఖతార్‌లో వరల్డ్ స్పేస్ వీక్ 2026 ప్రారంభం..!!

- October 06, 2026 , by Maagulf
ఖతార్‌లో వరల్డ్ స్పేస్ వీక్ 2026 ప్రారంభం..!!

దోహా: ఖతార్‌లో వరల్డ్ స్పేస్ వీక్ 2026 కార్యక్రమాలను కల్చరల్ విలేజ్ ఫౌండేషన్–కటారా ప్రారంభించింది. దోహాలోని అల్ థురయ్యా ఆస్ట్రానామికల్ డోమ్ (బిల్డింగ్ 41)లో ప్రారంభమైన ఈ కార్యక్రమాలకు కుటుంబాలు, విద్యార్థులు, అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తి ఉన్నవారు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలు అక్టోబర్ 7 వరకు ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు కొనసాగనున్నాయి.  

విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాలు

అంతరిక్ష విజ్ఞానం, సాంకేతికతపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు, స్థిరమైన అభివృద్ధిలో అంతరిక్ష రంగం పోషిస్తున్న పాత్రను వివరించడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని ప్రకటించారు.  

22 మీటర్ల భారీ స్క్రీన్‌పై గ్రహాల అనుభూతి

అల్ థురయ్యా ప్లానెటేరియంలో 22 మీటర్ల భారీ డోమ్ స్క్రీన్ పై Digistar వ్యవస్థ ద్వారా అంతరిక్షం, గ్రహాలు, సౌర కుటుంబానికి సంబంధించిన ఇమర్సివ్ ప్రదర్శనలు అందుబాటులో ఉన్నాయి. అన్ని వయసుల సందర్శకులు ఈ ప్రదర్శనలను వీక్షించవచ్చు. నిర్వాహకులు అందించే QR కోడ్ లేదా ఆన్‌లైన్ లింక్ ద్వారా సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీనితో పాటు ఇంటరాక్టివ్ ఎక్స్‌ప్లోరేషన్ పోటీలు, ప్రత్యేక ఫోటోగ్రఫీ కార్నర్‌ను కూడా ఏర్పాటు చేశారు.

అక్టోబర్ 4 నుంచి 10 వరకు వరల్డ్ స్పేస్ వీక్

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రకటించిన వరల్డ్ స్పేస్ వీక్ ప్రతి ఏడాది అక్టోబర్ 4 నుంచి 10 వరకు నిర్వహిస్తారు. 1957 అక్టోబర్ 4న ప్రపంచంలోనే తొలి కృత్రిమ ఉపగ్రహం స్పుట్నిక్-1 ప్రయోగించడాన్ని, 1967 అక్టోబర్ 10న ఔటర్ స్పేస్ ట్రీటీ అమల్లోకి రావడాన్ని గుర్తుచేసుకుంటూ ఈ తేదీల్లో వరల్డ్ స్పేస్ వీక్ నిర్వహిస్తున్నారు.

2026 సంవత్సరానికి “Rocket Revolution” అనే థీమ్‌ను ప్రకటించారు. ప్రయోగ సాంకేతికతలో వస్తున్న పురోగతి, ఆధునిక ఆర్థిక వ్యవస్థతో పాటు స్థిరమైన అభివృద్ధిలో అంతరిక్ష రంగం పెరుగుతున్న ప్రాధాన్యతను ఈ థీమ్ ప్రతిబింబిస్తోంది.

2018లో ప్రారంభమైన అల్ థురయ్యా ప్లానెటేరియం

ఖతార్‌లో తొలి ప్రత్యేక ప్లానెటేరియంగా అల్ థురయ్యా ప్లానెటేరియం 2018 డిసెంబర్‌లో ప్రారంభమైంది. ఇందులో 200 సీట్ల సామర్థ్యం ఉంది. అరబిక్, ఇంగ్లిష్ భాషల్లో క్రమం తప్పకుండా విద్యా కార్యక్రమాలు, ప్రదర్శనలు నిర్వహిస్తూ, కటారా కల్చరల్ విలేజ్‌లో శాస్త్రీయ అవగాహన పెంపొందించడంలో కీలక వేదికగా కొనసాగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com